ఇటుకతో తలపై కొట్టి, కత్తితో మర్మాంగం కోసి.. ఘట్‌కేసర్‌లో బాలుడి ఘాతుకం!

మద్యం మత్తు ఒక్కసారి ఆవేశాన్ని రెచ్చగొడితే ఎంత దారుణం జరుగుతుందో చూపించిన సంఘటన ఘట్‌కేసర్‌లో చోటుచేసుకుంది. డబ్బుల విషయంలో కొనసాగుతున్న వివాదం, తల్లిని దూషించినందుకు పెంచుకున్న కక్ష ఈ రెండు కారణాలతో ఓ 17 ఏళ్ల బాలుడు తనతోపాటు పనిచేస్తున్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. సోమవారం సాయంత్రం పోలీసులు బాలుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌లోని జగత్‌ స్వప్న స్పార్కిల్‌ క్యాసిల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న శివ, అతని బంధువు అయిన ఈ బాలుడు ఒకటే గదిలో నివసిస్తూ ఉండేవారు. బాలుడు ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందినవాడు. జీవనోపాధి కోసం హైదరాబాద్‌ కు వచ్చి ఘట్ కేసర్ లో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వివాదాలు కొనసాగుతూ వచ్చాయి.

Ghatkesar murder 17-Year-Old Watchman Kills Colleague with Brick and Knife in Ghatkesar in alcohol intoxication

ఈ క్రమంలో శివ బాలుడిని, అతని తల్లిని అవమానకరంగా తిట్టటం బాలుడిలో తీవ్రమైన కోపాన్ని నింపింది.ఈ క్రమంలో తాజాగా ఇద్దరూ కలిసి మద్యం తాగుతుండగా మరోసారి గొడవ మొదలైంది. కోపంతో రగిలిపోయిన మైనర్ బాలుడు శివను కింద పడేసి, సమీపంలో ఉన్న సిమెంట్‌ ఇటుకను తీసుకొని అతని ముఖం, తలపై బలంగా పదేపదే కొట్టాడు. దెబ్బల తీవ్రతతో శివ అక్కడికక్కడే మృతి చెందాడు.

అంతటితో ఆగకుండా గదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తిని తీసుకొని మృతుడి మర్మాంగాన్ని కోసేశాడు. ఈ ఘటనపై ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ పి.కిరణ్‌ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభమైంది. నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు సోమవారం అవుషాపూర్‌ ప్రాంతంలో బాలుడు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత రిమాండ్‌కు తరలించారు.

17 ఏళ్ల వయసు ఉన్నందున ఈ కేసు జువెనైల్‌ జస్టిస్‌ చట్టం కింద నడుస్తుంది. పిల్లల కోర్టులో విచారణ జరుగుతుంది. పని కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యువకులు చిన్న చిన్న వివాదాల్లో చిక్కుకుని తీవ్ర నేరాలకు పాల్పడుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. మద్యం సేవించి గొడవలు పెట్టుకోవడం, వ్యక్తిగత అవమానాలను సహించలేక ఆవేశానికి గురికావడం వంటివి ఇలాంటి దారుణాలకు దారితీస్తున్నాయి.

రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పీఎం రాహత్ మార్గదర్శకాలు!
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పీఎం రాహత్ మార్గదర్శకాలు!

పోలీసులు ఈ కేసులో సాక్ష్యాల సేకరణ, ఫోరెన్సిక్‌ పరీక్షలు కొనసాగిస్తున్నారు. స్థానికులు ఇలాంటి సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం నియంత్రణ, యువతలో స్వీయ నియంత్రణ, చిన్న వివాదాలను పెద్దవి చేసుకోకుండా పరిష్కరించుకునే అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+