Electric Plane: బ్యాటరీతో గాల్లోకి దూసుకెళ్లిన విమానం! గంటకు 300 కి.మీ స్పీడ్

ఇన్నాళ్లూ రోడ్లపైనే ఎలక్ట్రిక్ వెహికల్స్ హడావుడి చూశాం. కానీ, ఇప్పుడు కాలం మారుతోంది. ఆకాశంలో కూడా కాలుష్యాన్ని తగ్గించేందుకు చైనా అడుగులు వేసింది. పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ల స్థానంలో ఏకంగా బ్యాటరీతో నడిచే సరికొత్త ప్యాసింజర్ విమానాన్ని గాల్లోకి విజయవంతంగా ఎగరవేసింది. కేవలం ప్రయోగాత్మకంగానే కాకుండా, భవిష్యత్తులో సామాన్యులు కూడా ఎలక్ట్రిక్ విమానాల్లో ప్రయాణించేలా చైనా ఈ భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.

చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ 'కోమాక్' (COMAC) అభివృద్ధి చేసిన 10 టన్నుల బరువున్న 'CE-25A' ఎలక్ట్రిక్ విమానం తన తొలి పైలట్ తో ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. షాడాంగ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ టెస్ట్ ఫ్లైట్‌లో ముగ్గురు సిబ్బంది (ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్-టెస్ట్ ఇంజనీర్) విమానంలోనే ఉండి ప్రయాణించారు. నవంబర్ 14న జరిగిన ఈ టెస్ట్ లో విమానం గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని నిరూపితమైంది. మొత్తం 57 నిమిషాల పాటు సాగిన ఈ ప్రక్రియలో, విమానం 16 నిమిషాల పాటు గాల్లోనే ఉంటూ సుమారు 60 కిలోమీటర్ల దూరాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా చుట్టివచ్చింది.

Electric Plane China Completes Maiden Piloted Flight of 19-Seat Passenger aircraft 400 KM Range for Future Travel

సాంప్రదాయ ఇంజిన్లకు భిన్నంగా వినూత్న టెక్నాలజీ

సాధారణ విమానాల్లో ఉండే పెద్ద జెట్ ఇంజిన్లకు బదులుగా, ఈ కొత్త విమానంలో 'డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ డక్టెడ్-ఫ్యాನ್' ప్రొపల్షన్ సిస్టమ్‌ను వాడారు. అంటే విమానం రెక్కల వెంట అనేక చిన్న ఎలక్ట్రిక్ ఫ్యాన్లను అమర్చారు. ఇవి బ్యాటరీ నుంచి అందే శక్తితో పనిచేస్తూ విమానానికి కావలసిన వేగాన్ని, ముందుకు వెళ్లే శక్తిని ఇస్తాయి. ఇలా బలాన్ని ఒకే చోట కాకుండా రెక్కలన్నింటికీ సమానంగా పంపిణీ చేయడం ద్వారా సరికొత్త ఏరోడైనమిక్ డిజైన్‌ను పరీక్షించారు. దీని అసలు సామర్థ్యం, పనితీరు ఎంతవరకు బాగుందనేది రాబోయే రోజుల్లో జరిగే మరిన్ని పరీక్షల ద్వారా స్పష్టమౌతుంది.

సరోగసీ చేస్తే అంతే సంగతులు.. ఇక జైలుకేనా?
సరోగసీ చేస్తే అంతే సంగతులు.. ఇక జైలుకేనా?

దిగ్గజ సంస్థల కలయికతో రూపుదిద్దుకున్న అద్భుతం

ఈ విమానాన్ని కేవలం ఒకే సంస్థ తయారు చేయలేదు. చైనాకు చెందిన విమాన తయారీ దిగ్గజం 'కోమాక్'తో పాటు, ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ 'క్యాటిల్' (CATL) షాంఘై జియావో టంగ్ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. తక్కువ దూరాలు ప్రయాణించే ప్రాంతీయ విమాన ప్రయాణాలను పూర్తిగా మార్చివేయాలన్న లక్ష్యంతో ఏవియేషన్ రంగం, బ్యాటరీ టెక్నాలజీ, అకాడమిక్ రీసెర్చ్‌లను ఒకే తాటిపైకి తెచ్చి ఈ ప్రాజెక్టును రూపొందించారు.

ఒకేసారి 19 మంది ప్రయాణించేలా భారీ ప్లాన్

ఈ సీఈ-25ఏ విమానం కేవలం చిన్న చిన్న ప్రయోగాలకే పరిమితం కాలేదు. ఇది పూర్తి స్థాయిలో ఒక కమర్షియల్ విమానంగా పనిచేసేలా డిజైన్ చేశారు. దీని ముఖ్యమైన ప్రత్యేకతలు చూస్తే..

  • ఒకేసారి 19 మంది ప్రయాణికులు కూర్చునే అవకాశం ఉంది.
  • గరిష్టంగా 10 టన్నుల బరువుతో టేకాఫ్ అవ్వగలదు.
  • గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.
  • గరిష్టంగా 2,400 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు.
  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించే రేంజ్ దీని సొంతం.
3000 ఏళ్ల కిందటే నేత కళలో సంచలనం.. అరుదైన హిస్టారికల్ ప్రూఫ్!
3000 ఏళ్ల కిందటే నేత కళలో సంచలనం.. అరుదైన హిస్టారికల్ ప్రూఫ్!

త్వరలోనే వినియోగంలోకి తెచ్చేందుకు సన్నాహాలు

ఇప్పటికే ఈ విమానం కోసం ఫిబ్రవరిలోనే ఎలాంటి మనుషులు లేకుండా తొలి ఆటోమస్ ప్రయాణాన్ని పూర్తి చేశారు. దీనికి తోడు 19 సార్లు పైలట్ లేకుండా పరీక్షలను కూడా విజయవంతంగా నిర్వహించారు. సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా దీని టైప్ సర్టిఫికేట్ అప్లికేషన్ ను కూడా ఆమోదించింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ విమానాలను కేవలం ప్రయోగాల స్థాయి నుంచి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేలా చైనా చేస్తున్న ఈ ప్రయత్నం ఏవియేషన్ రంగంలో ఓ మైలురాయిగా నిలవనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+