జేమ్స్ బాండ్‌గా కొత్త హీరో ఎంట్రీ.. ఆరుగురి తర్వాత ఏడో నటుడు ఎవరంటే!

ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. ప్రఖ్యాత స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'జేమ్స్ బాండ్ 007'తదుపరి హీరోగా హాలీవుడ్ స్టార్ రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపికయ్యారు. 'ది బ్యాట్ మ్యాన్', 'ది ఒడిస్సీ' వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్యాటిన్సన్.. ఈ ఐకానిక్ పాత్రనుపోషించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో గత కొన్ని నెలలుగా కొత్త బాండ్ ఎవరనే దానిపై సాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికినట్లయింది.

సినిమా షూటింగ్ టైంలో హీరో, హీరోయిన్లు వాడే దుస్తులను తర్వాత ఏం చేస్తారు?
సినిమా షూటింగ్ టైంలో హీరో, హీరోయిన్లు వాడే దుస్తులను తర్వాత ఏం చేస్తారు?

డేనియల్ క్రెయిగ్ వారసుడిగా రాబర్ట్ ప్యాటిన్సన్
ఐదు సినిమాల పాటు జేమ్స్ బాండ్‌గా అలరించిన డేనియల్ క్రెయిగ్ స్థానాన్ని రాబర్ట్ ప్యాటిన్సన్ భర్తీ చేయనున్నారు. 2006లో 'క్యాసినో రాయల్' తో బాండ్ ప్రస్థానాన్ని ప్రారంభించిన డేనియల్ క్రెయిగ్.. 2001లో విడుదలైన 'నో టైమ్ టు డై' సినిమాతో ఆ పాత్రకు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ ముప్పును అడ్డుకునే క్రమంలో బాండ్ ప్రాణత్యాగం చేయడంతో ఆ సినిమా ముగిసింది. అప్పటి నుంచి కొత్త బాండ్ వేట కొనసాగుతూ వచ్చింది.

Robert Pattinson Officially Announced as Next James Bond Seventh Actor to Play 007 Full Details Here

ఇప్పటి వరకు జేమ్స్ బాండ్‌గా నటించిన ఆరుగురు హీరోలు వీరే..
అధికారిక 'ఇయాన్ ప్రొడక్షన్స్' సిరీస్‌లో ఇప్పటివరకు ఆరుగురు నటులు 007 ఏజెంట్ గా వెండితెరపై కనిపించారు. రాబర్ట్ ప్యాటిన్సన్ ఈ జాబితాలో ఏడో నటుడు కావడం గమనార్హం.

1. షాన్ కానరీ: 1962 నుంచి 1971 వరకు తొలి జేమ్స్ బాండ్‌గా నటించారు.

2.జార్జ్ లాజెన్‌బై: 1969లో ఒక్క సినిమాలో బాండ్‌గా కనిపించారు.

3.రోజర్ మూర్: 1973 నుంచి 1985 వరకు సుదీర్ఘ కాలం బాండ్ పాత్ర పోషించారు.

4. తిమోతీ డాల్టన్: 1987 నుంచి 1989 మధ్య రెండు చిత్రాల్లో నటించారు.

5. పియర్స్ బ్రాస్నన్: 1995 నుంచి 2002 వరకు 4 సినిమాలతో అలరించారు.

6. డేనియల్ క్రెయిగ్: 2006 నుంచి 2021 వరకు 5 సినిమాల్లో నటించారు.

యాక్షన్ లేదు.. రక్తపాతం లేదు.. దుల్కర్ కొత్త సినిమా ట్రైలర్‌లో అసలు కథ ఇదే!
యాక్షన్ లేదు.. రక్తపాతం లేదు.. దుల్కర్ కొత్త సినిమా ట్రైలర్‌లో అసలు కథ ఇదే!

రేసులో నిలిచిన ఇతర నటులు
కొత్త జేమ్స్ బాండ్ ఎంపిక కోసం గత కొన్ని నెలలుగా పలువురు బ్రిటీష్ నటుల పేర్లు బలంగా వినిపించాయి. తొలుత జాకబ్ ఎలోర్డి పేరు తెరపైకి వచ్చినా.. ఆయన అసలు ఆడిషన్ కే హాజరుకాలేదని తేలింది. ఆ తర్వాత 'స్లో హార్సెస్' నటుడు జాక్ లోడెన్, కాలమ్ టర్నర్ వంటి నటులు గట్టి పోటీదారులుగా నిలిచారు. అయితే చివరకు అందరి అంచనాలను నిజం చేస్తూ '007' బ్యాడ్జ్ రాబర్ట్ ప్యాటిన్సన్ సొంతమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+