సరోగసీ చేస్తే అంతే సంగతులు.. ఇక జైలుకేనా?

అద్దె గర్భం విషయంలో చైనా ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని రకాల సరోగసీ ప్రక్రియలను, వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేయడాన్ని క్రిమినల్ నేరంగా ప్రకటించింది. సరోగసీకి పాల్పడినా, దానికి మధ్యవర్తిత్వం వహించినా కఠినమైన చట్టపరమైన చర్యలతో పాటు జైలు శిక్ష తప్పదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి యాంగ్ జిన్‌రుయ్ శుక్రవారం స్పష్టం చేశారు.

శ్రేయస్ అయ్యర్ బ్లండర్.. తొలి ఓవర్లోనే టీమిండియా కథ క్లోజ్!
శ్రేయస్ అయ్యర్ బ్లండర్.. తొలి ఓవర్లోనే టీమిండియా కథ క్లోజ్!

చైనాలో అన్ని రకాల సరోగసీలపై పూర్తి నిషేధం ఉందని యాంగ్ జిన్‌రుయ్ వెల్లడించారు. సరోగసీ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసినా అది నైతిక ప్రమాణాలను ఉల్లంఘించడమే అవుతుందని.. చట్టప్రకారం కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా సరోగసీ పేరుతో చేసుకునే ఎలాంటి ఒప్పందాలకు చట్టపరమైన రక్షణ ఉండదని.. ఆ ఒప్పందాల్లో భాగస్వాములైన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

China Declares All Forms of Surrogacy a Criminal Act Violators Face Prison Terms warning of strict punishment

అక్రమ క్లినిక్‌లపై దాడుల తర్వాత కఠిన చర్యలు
మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్షాలో అక్రమంగా సరోగసీ నిర్వహిస్తున్న కేంద్రాలపై ఇటీవల అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. ఈ అక్రమ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టిన అధికారులు 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ప్రక్రియలో ఉపయోగించే భారీ మొత్తంలో మందులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ నీళ్ళు రోజుకో గ్లాస్ తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!
ఈ నీళ్ళు రోజుకో గ్లాస్ తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు!

మహిళల ఆరోగ్యం, గౌరవానికి ముప్పు
చైనా 2001లోనే సరోగసీపై నిషేధం విధించింది. వైద్య సంస్థలు, ఆరోగ్య సిబ్బంది ఎలాంటి సరోగసీ టెక్నాలజీని ఉపయోగించకూడదని ఆనాడే ఆదేశాలు జారీ చేసింది. అయితే రహస్యంగా ఈ దందా కొనసాగుతుండటంతో ప్రభుత్వం ఇప్పుడు దీన్ని క్రిమినల్ నేరంగా మార్చింది. సరోగసీ అనేది మహిళల ఆరోగ్యానికి, హక్కులకు తీవ్రమైన ముప్పు అని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అభిప్రాయపడింది. ఈ ప్రక్రియలో మహిళల శరీరాన్ని ఓ వస్తువుగా చూస్తున్నారని.. వారిని కేవలం పిల్లలను కనే యంత్రాలుగా మార్చడం వల్ల మహిళల గౌరవానికి భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేని సరోగసీ వల్ల గర్భధారణ సమస్యలు, సురక్షితం కాని వైద్య ప్రక్రియలతో మహిళల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని కమిషన్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+