ఎలాంటి యుద్ధానికైనా భారత్ సిద్దం.. పాక్ చేతికి లక్ష డ్రోన్ల వేళ.. ఇండియన్ నేవీ సంచలన ప్రకటన
భారత నేవీ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత నౌకాదళం ఎలాంటి యుద్ధానికైనా సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. టెక్నాలజీ, సర్వీలాన్స్, స్టీల్త్ అండ్ వెపన్స్ విభాగాల్లో భారత నౌకాదళం నాలుగు దశాబ్దాలుగా పట్టు సాధించిందని భవిష్యత్తులో వచ్చే ఎలాంటి యుద్ధానికైనా ఇండియన్ నేవీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ నేవీ అనేక అడ్డంకులను దాటుకుంటూ సమర్థవంతంగా, శక్తివంతంగా మారిందని స్పష్టం చేశారు. న్యూదిల్లీలో జరిగిన ఏఎన్ఐ నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 3.0 లో మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా మారుతున్న టెక్నాలజీ కారణంగా యుద్ధ స్వభావమే మారిపోయిందని అన్నారు. మిలిటరీ ఆపరేషన్స్ లోని దాదాపు అన్ని విభాగాల్లో కొత్త కొత్త టెక్నాలజీల ప్రభావం భారీగా ఉందని పేర్కొన్నారు.
గత నాలుగు దశాబ్దాలుగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.. గత ఐదేళ్లలోనే ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు యుద్ధ స్వభావం మారిపోయింది. యుద్ధం అంటే కేవలం తుపాకులు, క్షిపణులు మాత్రమే కాదని.. ఇటీవలి కాలంలో సైబర్ దాడులు, స్పేస్ వార్ ఫేర్ లు లాంటివి గణనీయంగా పెరుగుతున్నాయని అన్నారు. తక్కువ ఖర్చుతోనే ఈ అత్యాధునిక టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందని దాని కారణంగా చిన్న చిన్న దేశాలు సైతం ప్రస్తుతం ప్రమాదకరంగా మారాయని స్పష్టం చేశారు.

ఇక భారత నౌకాదళం గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పథంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు భవిష్యత్తులో వచ్చే ఎలాంటి యుద్ధాలకైనా భారత నౌకాదళం సిద్ధం అవుతోందని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత నేవీ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక ఇప్పటికే పాకిస్థాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంలో ఉన్నా టర్కీ, సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి అత్యాధునిక ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకుంటోంది. తాజాగా టర్కీ నుంచి పాకిస్థాన్ లక్ష ఎఫ్ పీవీ డ్రోన్ లను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణ స్వామినాథన్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.












Click it and Unblock the Notifications
