తెలంగాణ ఫోక్ సాంగ్ సంచలనం.. వ్యూస్ లో అల్లు అర్జున్ బుట్టబొమ్మను బీట్ చేసిందిగా..
తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఎప్పుడూ ప్రత్యేకమే.. ఎంతో హుషారుగా సాగే ఈ పల్లె పాటల్ని ఎంత విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది. ఈ సరదా పాటలకు స్టెప్పులు వేయాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఇటీవల సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిన క్రమంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ వ్యూస్ గణనీయంగా పెరుగుతున్నాయి.
సినిమా పాటలను మించిన రెస్పాన్స్ ఈ పాటలకు వస్తుంది. ఎంతలా అంటే తెలంగాణ ఫోక్ సాంగ్స్ ను ఏకంగా ఇప్పుడు స్టార్ హీరో సినిమాల్లోనే పెడుతున్నారు. ఆ రేంజ్ లో ఈ పల్లె బీట్ లు జనాలకు అలవాటుగా మారాయి. అయితే ఇటీవల సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోక్ సాంగ్ 'రాను బొంబాయికి రాను' మరో అరుదైన రికార్డును అందుకుంది. ఈ పాట 2025 లో విడుదలైంది. అయితే ఇప్పటివరకు ఈ పాట యూట్యూబ్ లో 956 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.
అంతేకాక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాలోని బ్లాక్ బస్టర్ సాంగ్ బుట్టబొమ్మ సాంగ్ వ్యూస్ ను కూడా బద్దలు కొట్టడం విశేషం. 2020 లో బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఇప్పటి వరకూ 955 మిలియన్స్ వ్యూస్ ను సంపాదించింది. అయితే 'రాను బొంబాయికి రాను' సాంగ్ మాత్రం రెండేళ్లలోనే ఈ పాటను బీట్ చేస్తూ 956 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

ఒక ఫోక్ సాంగ్ కు ఈ స్థాయిలో ఆదరణ రావడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లోని పాటలను మించిన వ్యూస్ అంటే తెలంగాణ పాటలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతోంది. ఇక సింగర్ రాము రాథోడ్ రాసిన ఈ పాట ఆయన స్వయంగా ఆలపించడమే కాకుండా ఇందులో నటించి సందడి చేశారు. ఈ పాటలో రాము రాథోడ్ కు జంటగా లిఖిత అద్భుతమైన స్టెప్పులు, హావభావాలతో అలరించింది. ఇక మున్ముందు ఈ పాట ఇంకెన్ని రికార్డుల్ని బద్దలు కొడుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications
