'బుల్లెట్ ప్రూఫ్ అద్దాలున్నా వదలం'.. అమితాబ్ ఫ్యామిలీకి గ్యాంగ్‌స్టర్ వార్నింగ్!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు మరోసారి ప్రాణహాని బెదిరింపులు వచ్చాయి. ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడైన గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియా వేదికగా ఈ సంచలన హెచ్చరికలు జారీ చేశాడు. ఈ సారి బిగ్ బీని బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు కూడా కాపాడలేవంటూ నేరుగా వార్నింగ్ ఇచ్చాడు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో అమితాబ్ బచ్చన్ చేసినట్లుగా చెబుతున్న నిరాధారమైన కామెంట్లే ఈ బెదిరింపులకు కారణమని తెలుస్తోంది.
200 మంది అనుచరులు సిద్దం
సోమవారం ఫేస్‌బుక్‌లో గోల్డీ ధిల్లాన్ ఓ పోస్ట్ పెట్టాడు. ఇటీవల ముంబైలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తమ ఇద్దరు అనుచరులను(వికాస్ ఠాకూర్, దీపక్ సింగ్) అరెస్ట్ చేసినంత మాత్రాన తమ పనులు ఆగిపోవని స్పష్టం చేశాడు. వారిద్దరూ కేవలం తన ముఠాకు చెందినవారేనని.. వారి అరెస్ట్ వల్ల తాము ప్లాన్ చేసిన దాడి ఆగలేదని పేర్కొన్నాడు. ముంబైలో తనకు చెందిన 200 మంది అనుచరులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని గోల్డీ ధిల్లాన్ సంచలన ప్రకటన చేశాడు.

తండ్రీకొడుకులకు నేరుగా వార్నింగ్
అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుంటూ.. "మీరు ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ క్యాబిన్లు కట్టుకున్నా.. ఎంతటి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నా సరే.. ఆ క్యాబిన్లలోనే తండ్రీకొడుకులను అంతం చేస్తాం" అంటూ గోల్డీ ధిల్లాన్ హెచ్చరించాడు. ఆ బెదిరింపు అనంతరం బ్రాకెట్లలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ పేర్లను స్పష్టంగా ప్రస్తావించాడు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులుగా ఉన్న ఎవరినీ క్షమించబోమని, వారు ఏ దేశంలో ఉన్నా సరే వెతికి పట్టుకుంటామని ఆ పోస్టులో రాసుకొచ్చాడు. ఈ పోస్టుకు గోల్డీ ధిల్లాన్ గ్రూప్, రాణా ధిల్లాన్, రాకీ పోర్చుగల్ వంటి పలు నెట్వర్క్ హ్యాండిల్స్‌ను ట్యాగ్ చేశాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన భద్రతా ఏజెన్సీలు, అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా' వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసే పనిలో నిమగ్నమయ్యాయి.
అసలేంటీ 1984 అల్లర్ల వివాదం?
1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురైన తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి బయట అమితాబ్ బచ్చన్ గుంపును రెచ్చగొట్టారని సిక్కు అల్లర్ల సాక్షి జగదీష్ కౌర్ గతంలో ఆరోపించారు. దూరదర్శన్ ప్రత్యక్షప్రసారంలో అమితాబ్ చేయి పైకెత్తి 'రక్తానికి రక్తం' అంటూ నినాదాలు చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అలాంటి ప్రసారానికి సంబంధించి ఎలాంటి అధికారిక వీడియో ఆధారాలు ఇప్పటివరకు బయటకు రాలేదు.
इस बार Facebook पोस्ट के जरिए Amitabh Bachchan और उनके बेटे Abhishek Bachchan को जान से मारने की धमकी दी गई है।इस बार बाप के साथ बेटे का भी नाम है।गैंगस्टर Goldy Dhillon ने साफ लिखा है कि पिता पुत्र चाहे कितने भी बुलेटप्रूफ केबिन बनवा लें, उन्हें गोली मारी जाएगी।कल दिल्ली पुलिस ने दो शूटरों को गिरफ्तार किया था, जिन पर अमिताभ बच्चन को निशाना बनाने की साजिश का आरोप है।इसके बाद आज गोल्डी ढिल्लों ने फेसबुक पोस्ट के जरिए दावा किया कि...1/2
— Rahul Kumar (@MukAn_X) November 16, 2026














Click it and Unblock the Notifications
