'ప్రాణాలతో తిరిగొస్తానో లేదో తెలియదు'.. న్యాయమూర్తులకు ఇమ్రాన్ ఖాన్ సంచలన లేఖ!

పాకిస్థాన్‌లోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనకు, తన భార్య బుష్రా బీబీకి తక్షణమే వైద్య సాయం అందించాలని కోరుతూ పాకిస్థాన్ ఫెడరల్ కాన్‌స్టిట్యూషనల్ కోర్టు, సుప్రీంకోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సోమవారం(నవంబర్ 16) బహిరంగ లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాది బారిస్టర్ సల్మాన్ సఫ్దర్ ఈ లేఖను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

పాకిస్థాన్ 'డ్రోన్ వార్'.. లక్ష టర్కిష్ FPV డ్రోన్ లతో.. భారత్ అలర్ట్.. ఏం జరుగుతోంది..?
పాకిస్థాన్ 'డ్రోన్ వార్'.. లక్ష టర్కిష్ FPV డ్రోన్ లతో.. భారత్ అలర్ట్.. ఏం జరుగుతోంది..?

నా గుండె దెబ్బతింది.. బ్రెయిన్ హెమరేజ్ ముప్పు ఉంది: ఇమ్రాన్ ఖాన్
తన ఆరోగ్య పరిస్థితిపై ఇమ్రాన్ ఖాన్ లేఖలో అత్యంత భావోద్వేగపూరితంగా పేర్కొన్నారు. "పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు నా జీవితమంతా ఆస్పత్రులు నిర్మించడానికే కేటాయించాను. కానీ నేడు నాకు, నా భార్యకు కనీస వైద్యం కావాలని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒంటరి నిర్బంధం కారణంగా నా రక్తపోటు అదుపు తప్పుతోంది. ఇటీవల బీపీ 193కి చేరింది. నాకు బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నా గుండె ఇప్పటికే దెబ్బతింది. 74 ఏళ్ల వయసులో ఈ పరిస్థితి నన్ను బహుశా ప్రాణాలతో తిరిగి రాలేని స్థితికి తీసుకెళ్తోంది" అని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

May Not Return Alive Imran Khan Writes Open Letter to Pak Judges Seeking Medical Aid Details

కంటి చూపునకు ముప్పు
జైలు అధికారులు తనను రోజులో 22 గంటల పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, విదేశాల్లో ఉన్న తన కుమారులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదని, కనీసం పుస్తకాలు, టీవీ సౌకర్యం కూడా నిలిపివేశారని పేర్కొన్నారు. ఫిబ్రవరిలోనే తన కుడి కంటి చూపు 85 శాతం మేర తగ్గిపోయిందని, ఈ విషయాన్ని తన కుటుంబానికి కూడా తెలియజేయలేదని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

2050 నాటికి పాకిస్థాన్ లక్ష్యం ఇదే.. షెహబాజ్ షరీఫ్ సంచలనం
2050 నాటికి పాకిస్థాన్ లక్ష్యం ఇదే.. షెహబాజ్ షరీఫ్ సంచలనం

బుష్రా బీబీ కంటి చూపు శాశ్వతంగా పోయే ప్రమాదం
తన భార్య బుష్రా బీబీ ఆరోగ్యంపైనా ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్‌లో కంటి సమస్యతో ఆమెకు శస్త్రచికిత్స జరిగిందని, అయితే ఈ నెలలో ఆమెను కలిసినప్పుడు వెలుతురును భరించలేకపోవడం, కళ్లు సరిగ్గా తెరవలేకపోవడం గమనించానని వెల్లడించారు. వెంటనే మరోసారి సర్జరీ చేయకపోతే ఆమె కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆగస్టు 18న సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ తనను ఫిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించలేదని.. ఆలస్యం కాకముందే న్యాయమూర్తులు స్పందించి తమకు వైద్య సాయం అందేలా చూడాలని ఇమ్రాన్ ఖాన్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+