2050 నాటికి పాకిస్థాన్ లక్ష్యం ఇదే.. షెహబాజ్ షరీఫ్ సంచలనం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముడి చమురు, గ్యాస్ రవాణా నిలిచిపోయి పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. అయితే అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మరింతగా దిగజారుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్ ను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ఆ దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తింది. రాజకీయ అస్థిరతతోపాటు భద్రతా సవాళ్లు, సామాజిక సమస్యలను ఎదుర్కొంటోంది. మరోవైపు పాకిస్థాన్ లో పేదరికం, నిరుద్యోగ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. అంతర్గత భద్రతా సమస్యలతోపాటు ఉపాధి, ఉద్యోగాల వేటలో లక్షలాది మంది పాకిస్థానీ పౌరులు దేశం విడిచి పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.

2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్ మారుతుందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఓవైపు దేశం అప్పుల్లో కూరుకుపోయింది. మరోవైపు ఐఎంఎఫ్ నుంచి మరో 1.2 బిలియన్ డాలర్ల సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ లో శుక్రవారం జరిగిన పాకిస్థాన్ మినరల్స్ ఇన్ వెస్ట్ మెంట్ ఫోరమ్‌ లో ఆ దేశ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 2022 లో గోల్డ్ మాన్ సాక్స్ అంచనా ప్రకారం.. పాకిస్థాన్ 2075 నాటికి ఆరవ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసింది. అయితే తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. 2050 కంటే ముందే పాకిస్థాన్ ఆ అంచనాలను అందుకుంటుందని స్పష్టం చేశారు.

Pakistan to become the sixthlargest economy by 2050 ambitious goal despite being mired in debt trap

ఇక పాకిస్థాన్ లో ఉన్న అపారమైన ఖనిజ నిల్వలను బయటి దేశాలకు ముడి పదార్థాలుగా ఎగుమతి చేయకుండా.. మన దేశంలోనే వాటిని పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చాలని పెట్టుబడిదారులకు కీలక సూచనలు చేశారు. ఇందుకోసం దేశంలో స్మెల్టర్లు, రిఫైనరీలను ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. అలాగే బలూచిస్థాన్ లోని ప్రముఖ ఖనిజ నిల్వల కేంద్రం అయిన రెకో డిక్ ప్రాంతంలో ఖనిజాల ఉత్పత్తి 2028 నుంచి ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+