SIR పై ఈసీకి 48 ప్రశ్నలు-నేరుగా అడిగేందుకు సుప్రీం అనుమతి కోరిన విపక్షాలు..!

కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR)పై విపక్ష ఇండియా కూటమి (India Bloc) ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తోంది. విపక్షాల ఓట్లను తొలగించి బీజేపీకి మేలు చేసేందుకు ఈసీ ఎస్ఐఆర్ ను వాడుకుందంటూ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ విషయంలో ఈసీని నేరుగా ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విపక్ష ఇండియా కూటమి పార్టీలు ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ సిద్దం..! నోటిఫికేషన్ కు ముహుర్తం..!
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ సిద్దం..! నోటిఫికేషన్ కు ముహుర్తం..!

ఇప్పటికే తాము దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని లాంఛనంగా ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టును విపక్షాలు కోరాయి. ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణపై స్పందిస్తూ.. వాస్తవాలు, ఆధారాల పత్రాలు బయటపెట్టకుండా ఈసీ కేవలం వాదనలకే పరిమితం అవుతున్న విషయాన్ని విపక్షాలు సుప్రీం దృష్టికి తెచ్చాయి. ఈ విషయంలో ఈసీ నుంచి వివరణాత్మక సమాధానాలు రాబట్టేందుకు వీలుగా ఈ విచారణ అవసరమని తెలిపాయి. ఈ మేరకు సీఈసీ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు వివేక్ జోషీ, సుఖ్ బీర్ సింగ్ సంధూతో పాటు డిప్యూటీ కమిషనర్ భానుప్రకాష్, ఇతర అధికారుల్ని ప్రశ్నించేందుకు 48 ప్రశ్నల్ని కూడా విపక్షాలు సిద్దం చేశాయి. వీటిని సుప్రీంకోర్టుకు సమర్పించాయి.

SIR Row India bloc Parties Ask Supreme Court to Allow Formal Questioning of Election Commission
ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కు షాకిచ్చిన లాయర్- ఆ సీట్లో కూర్చొనే అర్హత లేదంటూ వాగ్వాదం..!
ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కు షాకిచ్చిన లాయర్- ఆ సీట్లో కూర్చొనే అర్హత లేదంటూ వాగ్వాదం..!

ఒక సంస్థగా వ్యవహరిస్తున్న ఎన్నికల కమిషన్ నిర్దిష్ట నిర్ణయాలు తీసుకుందా లేదా, వాటిని ఎప్పుడు, ఏ విధంగా తీసుకున్నారు, కమిషన్ పేరుతో నిర్దిష్ట చర్యలకు ఎవరు అధికారం ఇచ్చారు, ఈసీఐ నెట్ యాప్ ను ఎలా రూపొందించారు, మార్చారు, నిర్వహించారనే అంశాలపై ఈసీ తప్ప వాస్తవాలు తెలుసుకునేందుకు పిటిషనర్లకు వేరే మార్గం లేదని విపక్షాలు సుప్రీంకు తెలిపాయి.
దేశవ్యాప్త ఎస్ఐఆర్ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయం, ఆమోద ప్రక్రియ, ఎన్నికల సంఘం సభ్యుల మధ్య ఉండే భేదాభిప్రాయాలపై ఈ మేరకు విపక్షాలు స్పష్టత కోరాయి. ప్రతి ఎస్ఐఆర్ ఉత్తర్వుకు సంబంధించి, కమిషన్ నిర్ణయం తీసుకున్న ఫైలు సంఖ్యను, ఆ నిర్ణయం తీసుకున్న తేదీని, అది సమావేశంలో జరిగిందా, ఫైలును సర్క్యులేట్ చేయడం ద్వారా జరిగిందా లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా జరిగిందా అనే వివరాలను, అలాగే ప్రతి సభ్యుడు తమ ఆమోదాన్ని తెలిపిన తేదీని తెలియజేయాలని కోరాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+