టాక్ కి.. వచ్చిన కలెక్షన్స్ కు సంబంధం లేదేంటన్నా..!
ప్రతి శుక్రవారం థియేటర్లలోకి చాలా సినిమాలు వస్తుంటాయి. అందులో పెద్ద హీరోల సినిమాలు ఉంటాయి.. చిన్న హీరోల సినిమాలూ ఉంటాయి. అటు డబ్బింగ్ మూవీస్ కూడా ఉంటాయి. ఈ వారం కూడా అన్నీ కలుపుకుని దాదాపు పదికి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిల్లో 'ఇట్లు అర్జున' సినిమాకు మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది.
అయితే ఇది పేరుకు చిన్న సినిమా అయినా ఎన్టీఆర్, రామ్ చరణ్, అఖిల్ వంటి ప్రముఖ తారలు ప్రచారంలో భాగం కావడంతో విడుదలకు ముందే ఈ మూవీపై భారీగా హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రంతో అనీష్ కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. అక్కినేని నాగార్జున సమర్పణలో, దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించారు. ఈ చిత్రానికి మహేష్ ఉప్పల దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో 'ఛాంపియన్' ఫేమ్ అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటించింది.
మూవీలోని హీరో అనీష్ రెడ్డి.. ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత మహేష్ రెడ్డి తనయుడు. దాంతో ఈ మూవీపై ఇండస్ట్రీలో రిలీజ్ కు ముందే బజ్ ఏర్పడింది. టాలీవుడ్ ప్రముఖ హీరోలంతా సినిమాను ప్రొమోట్ చేశారు. ఇక నవంబరు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఈ మూవీలో హీరో మూగవాడు కావడం.. అలాగే సినిమాలో ఫన్, లవ్ ఉండటం.. మరికొంత యాక్షన్ తో కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మూవీ తెరకెక్కడంతో సినిమాకు హిట్ టాక్ వచ్చినట్లు స్పష్టం అవుతోంది. మరి కలెక్షన్స్ విషయానికి వస్తే మాత్రం.. వచ్చిన టాక్ కు వసూళ్లకు సంబంధం లేదని తెలుస్తోంది. ఇట్లు అర్జున మూవీకి తొలి రోజు రూ. 1.23 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అలాగే రెండో రోజు రూ.1.38 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.ఇట్లు అర్జున మూవీకి మూడోరోజు ఆదివారం రూ. కోటి 4 లక్షల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో ఈ మూవీకి జీరో కలెక్షన్స్ వస్తున్నాయి. మరి ఈ మూవీకి ఈ సోమవారం నుంచి కలెక్షన్స్ ఎలా వస్తాయన్నదానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది.












Click it and Unblock the Notifications
