తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో మార్చి 2027లో జరగనున్న పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పాఠశాల విద్యాశాఖ తాజాగా పొడిగించింది. విద్యార్థుల సౌకర్యార్థం ఎటువంటి ఆలస్య రుసుము లేకుండానే నవంబర్ 26వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఫీజు చెల్లింపు ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. అలాగే నవంబర్ 27 తేదీలోగా ఆన్‌ లైన్ ద్వారా ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆలస్య రుసుముతో వివిధ దశల్లో ఫీజు చెల్లించే తేదీలను విద్యాశాఖ సవరించింది.

ఆ వివరాలు చూస్తే.. ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 26 వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఆ గడువు ముగిస్తే రూ. 50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 8 వరకు అవకాశం కల్పించారు. అలాగే రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10 నుంచి 21 వరకు గడువు విధించారు. ఇక రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 23 నుంచి జనవరి 4 వరకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇక పరీక్ష ఫీజు విషయానికి వస్తే.. పదో తరగతి అన్ని సబ్జెక్టులకు కలిపి అంటే మూడు కంటే ఎక్కువ సబ్జెక్ట్ లకు పరీక్ష ఫీజును రూ. 125గా నిర్ణయించారు. అయితే మూడు సబ్జెక్టుల వరకు మాత్రమే రాసేవారు రూ.110 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఒకేషనల్ కోర్సు విద్యార్థులు రెగ్యులర్ ఫీజుకు అదనంగా మరో రూ.60 చెల్లించాలి. దాంతోపాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు పరీక్ష ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.

Telangana students Relief for Class 10 students in Telangana Deadline for exam fee payment extended

ఇక అధికారిక వెబ్‌ సైట్ అయిన bse.telangana.gov.in లో స్కూల్ లాగిన్ ద్వారా ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్కూల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. అంతేకాక IFMS చలాన్లు, బ్యాంకు చలాన్ల ద్వారా చేసే చెల్లింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది ఉండదని పేర్కొంది. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆఖరి తేదీ వరకు వేచి చూడకుండా సకాలంలో ఫీజు చెల్లించి ఇబ్బందులు పడకుండా చూడాలని విద్యాశాఖ అధికారులు సూచనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+