మజ్జి సిరికి మరోసారి హైకోర్టు షాక్- కీలక ఉత్తర్వులు..! ఇప్పటికే ఓ ట్విస్ట్..!

గతంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్ర తాజాగా జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ సందర్భంగా బీసీ కుల ధృవీకరణ పత్రం వివాదంలో చిక్కుకున్నారు. ఎస్టీ అయిన ఆమె.. నకిలీ బీసీ సర్ఠిఫికెట్ సమర్పించి ఎన్నికల్లో పోటీ చేశారంటూ వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. ఆమె కుల ధృవీకరణ పత్రంపై విచారణ జరపాలని కలెక్టర్ ను ఆదేశించడంతో పాటు దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందకుండా అడ్డుకోవాలని ఉత్తర్వులిచ్చింది. దీనిపై ఆమె డివిజన్ బెంచ్ లో రిట్ అప్పీలు దాఖలు చేశారు.

వైసీపీలో జగన్ భారీ ప్రక్షాళన ? ముహుర్తం ఖరారు-30-70 మందిపై వేటు?
వైసీపీలో జగన్ భారీ ప్రక్షాళన ? ముహుర్తం ఖరారు-30-70 మందిపై వేటు?

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ మరోసారి మజ్జి సిరికి (Majji Siri Sahasra) షాకిచ్చింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని కొట్టేయాలన్న ఆమె విజ్ఞప్తిని డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. తద్వారా గతంలో ఆమె బీసీ సర్ఠిఫికెట్ పై విచారణ జరపాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు విచారణ కొనసాగనుంది. ఈ వ్యవహారం తేలే వరకూ మజ్జి సిరి తెర్లాం జడ్పీటీసీ స్ధానంలో సాధించిన విజయం ఖరారు కావడం ఆలస్యం కానుంది.

Setback for TDP Leader Majji Siri Sahasra as AP High Court Dismisses Her Plea in BC Certificate Case
సిరి సహస్రకు హైకోర్టులో భారీ షాక్- బీసీ సర్టిఫికెట్ పై కలెక్టర్ కు కీలక ఆదేశాలు..!
సిరి సహస్రకు హైకోర్టులో భారీ షాక్- బీసీ సర్టిఫికెట్ పై కలెక్టర్ కు కీలక ఆదేశాలు..!

మరోవైపు మజ్జి సిరి బీసీ సర్టిఫికెట్ వివాదాన్ని తేల్చాలంటూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్ని పాటించాల్సిన కలెక్టర్.. దాన్ని జాయింట్ కలెక్టర్ కు అప్పగించారు. దీనిపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కుల ధృవీకరణ పత్రం వివాదం తేల్చాల్సింది కలెక్టర్ అని, అలా కాకుండా తాను చేయాల్సిన పనిని జేసీకి ఆయన ఎలా అప్పగిస్తారంటూ ఈ పిటిషన్ లో పిటిషనర్ ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 18న విచారణ జరగాల్సి ఉంది. ఈ పిటిషన్ పై విచారణలో హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా కలెక్టర్ తదుపరి విచారణ కొనసాగించే అవకాశం ఉంది. దీంతో మజ్జి సిరి బీసీ సర్టిఫికెట్ వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+