వైసీపీలో జగన్ భారీ ప్రక్షాళన ? ముహుర్తం ఖరారు-30-70 మందిపై వేటు?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్ని అధికార కూటమిని మించి విపక్ష వైఎస్సార్సీపీ సీరియస్ గా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తుదికంటా పోరాడాలంటూ జగన్ ఇచ్చిన పిలుపు బాగానే ఫలించింది. మున్సిపల్ ఎన్నికల్లో ఓ మోస్తరుగా, పరిషత్ ఎన్నికల్లో పోటీ పోటీగా ఫలితాలు సాధించిపెట్టాయి. అయితే ఇంత భారీ ప్రయత్నంలోనూ అక్కడక్కడా లోపాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల నుంచి క్యాడర్ కు తగిన సహకారం లభించలేదన్న ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై దృష్టిసారించిన పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆ మేరకు పార్టీలో భారీ ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

వైసీపీ గెలిచిన చాలాచోట్ల ఫలితాల తారుమారు ? పార్టీ నేతలతో జగన్ కామెంట్స్..!
వైసీపీ గెలిచిన చాలాచోట్ల ఫలితాల తారుమారు ? పార్టీ నేతలతో జగన్ కామెంట్స్..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఫలితాలపై తాజాగా వైఎస్ జగన్ పోస్టు మార్టం నిర్వహించినట్లు సమాచారం. ఇందులో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన 60-70 మంది ఇన్ ఛార్జ్ ల పనితీరు బాగోలేదని అధిష్టానానికి నివేదిక అందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో హౌస్ అరెస్టుల పేరుతో సెల్ఫీ వీడియోలకే పరిమితమైన నేతలపై పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ముఖ్యంగా స్దానిక సంస్దల ఎన్నికల్లో తాము అప్పులు చేసి మరీ పోటీ చేస్తే.. ఇంఛార్జ్ లు సహకరించలేదంటూ పలువురు అభ్యర్ధుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధిష్టానం చర్యలు తీసుకోక తప్పని పరిస్దితి ఎదురవుతోంది.

YS Jagan Plans Major YSRCP Revamp After Sankranti Depending on Local Body Poll Results
వైసీపీ కాకినాడ మేయర్ అభ్యర్ధి ఖరారు- పార్టీలో చేరగానే జగన్ ప్రకటన..!
వైసీపీ కాకినాడ మేయర్ అభ్యర్ధి ఖరారు- పార్టీలో చేరగానే జగన్ ప్రకటన..!

ఈ నేపథ్యంలో త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్ని యాసిడ్ టెస్ట్ గా వైఎస్సార్సీపీ అధిష్టానం భావిస్తోంది. ఇందులో వచ్చే ఫలితాల ఆధారంగా సంక్రాంతి తర్వాత 30-70 మంది ఇన్ ఛార్జ్ లపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు గట్టిగా రెండేళ్ల సమయం ఉంది. ఈలోపే పార్టీలో కీలక మార్పులు చేపట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో కొత్త ముఖాల్ని తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా సార్వత్రిక ఎన్నికలకు ముందే పార్టీలో ప్రక్షాళన చేపట్టేందుకు జగన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎవరెవరికి షాకులు ఉంటాయో త్వరలో తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+