జగన్ ఫ్యామిలీపై జనసైనికుల రోత వ్యాఖ్యలు- ఏపీ మహిళా కమిషన్ ఫైర్..!
ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంతో పాటు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఇలా ఎవర్నీ వదలకుండా జనసైనికులు తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో రెచ్చిపోయారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి పెటాకులు అయిన తర్వాత దీనిపై స్పందించకుండా టీడీపీ, వైసీపీ తమ క్యాడర్ ను కట్టడి చేస్తున్న సమయంలోనే వీరు ఎక్స్ స్పేసెస్ లో ఓ మీటింగ్ పెట్టుకుని రెచ్చిపోయారు. ఇందులో వారు చేసిన వ్యాఖ్యలు ఎవరికైనా రోత పుట్టించేలా ఉన్నాయి.
వీటిపై ఇప్పటివరకూ జనసేన కానీ, కూటమిలోనే ఉన్న టీడీపీ, బీజేపీ కానీ స్పందించలేదు. అలాగే మహిళా కమిషన్ కూడా (ap women commission) స్పందించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆలస్యంగా ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ ఎక్స్ లో స్పందించారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు. ట్విట్టర్ స్పేస్ వేదికగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమైన చర్య అన్నారు.

రాజకీయాల పేరుతో మహిళలను అవమానించడం, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మంచిది కాదని రాయపాటి శైలజ తెలిపారు.
మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇటువంటి చర్యలను మహిళా కమిషన్ సహించదన్నారు. సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ తెలిపారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు జనసైనికుల బహిరంగ రోత వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు. ఇప్పుడు మహిళా కమిషన్ స్పందన నేపథ్యంలో పోలీసులు వాటిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది. జనసేన వైపు నుంచి అయితే కనీసం మందలింపు కూడా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.













Click it and Unblock the Notifications
