EPFO: గట్టి ఎదురుదెబ్బ.. ఉద్యోగుల పెన్షన్ హక్కులపై హైకోర్టు చారిత్రక తీర్పు.

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోని ప్రైవేట్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిబంధనలను అడ్డుపెట్టి హైయర్ పెన్షన్ దరఖాస్తులను తిరస్కరించడానికి వీలేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. స్టాట్యూటరీ పింఛను హక్కుల విషయంలో ప్రైవేట్ ట్రస్ట్ రూల్స్ ఏ మేరకు వర్తిస్తాయనే దానిపై ఈ తీర్పు ఒక స్పష్టతనిచ్చింది. చట్టబద్ధమైన హక్కులను నిరోధించేలా ప్రైవేట్ సంస్థల నిబంధనలు ఉండకూడదంటూ వెలువడిన ఈ తీర్పు ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

రిజెక్ట్ చేసిన ఈపీఎఫ్‌వో ఆదేశాలు చెల్లవన్న ధర్మాసనం

ఉద్యోగులు సమర్పించిన అధిక పింఛను దరఖాస్తులను ఈపీఎఫ్‌వో వివిధ కారణాలతో తిరస్కరించడాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. ప్రైవేట్ ట్రస్ట్ నిబంధనలు వేతన పరిమితికి లోబడి ఉన్నాయనే సాకుతోనూ, ఇప్పటికే పలు హైకోర్టులు కొట్టివేసిన సర్క్యులర్లను ప్రాతిపదికగా తీసుకుని దరఖాస్తులను తిరస్కరించడం సరికాదని జస్టిస్ సందీప్ వి. మార్నే ధర్మాసనం పేర్కొంది. ఈపీఎఫ్‌వో జారీ చేసిన ఆ ఉత్తర్వులు చట్టబద్ధంగా నిలబడేవి కావు కాబట్టి వాటిని రద్దు చేస్తున్నట్లు కోర్టు తేల్చిచెప్పింది.

Bombay High Court Rules EPFO Cannot Reject Higher Pension Claims Citing Private PF Trust Rules

అసలు వివాదం ఏంటి?..

రూ. 15,000 వేతన పరిమితి నిబంధనలతో సంబంధం లేకుండా, తమ యాక్చువల్ శాలరీ ఆధారంగా అధిక పింఛను పొందాలని కోరుతూ పలువురు ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీఎస్, 1995 నిబంధనల ప్రకారం జాయింట్ ఆప్షన్ ఎక్సర్‌సైజ్ చేసేందుకు తమకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. యజమానుల ట్రస్ట్ నిబంధనలు సహా ఇతర పత్రాల కొరతను చూపుతూ ఈపీఎఫ్‌వో తమ దరఖాస్తులను రిజెక్ట్ చేసిందని వారు వాదించారు.

EPFO Pension: నవంబర్ 19న కీలక భేటీ.. పెన్షన్ 3 రెట్లు పెరుగుతుందా?
EPFO Pension: నవంబర్ 19న కీలక భేటీ.. పెన్షన్ 3 రెట్లు పెరుగుతుందా?

ఎనిమిది వారాల్లోగా దరఖాస్తులు ఆమోదించాలి.. కోర్టు స్పష్టమైన ఆదేశాలు

ఉద్యోగుల వాదనలతో ఏకీభవించిన బాంబే హైకోర్టు.. ఈపీఎఫ్‌వో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఉద్యోగులు సమర్పించిన జాయింట్ ఆప్షన్ దరఖాస్తులను పరిశీలించి, ఎనిమిది వారాల్లోగా వాటిని ఆమోదించాలని ఈపీఎఫ్‌వోను ఆదేశించింది. చారిత్రక రికార్డులు లేవనే కారణంతో దరఖాస్తులను యాంత్రికంగా తిరస్కరించకుండా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశీలించే హేతుబద్ధమైన విధానాన్ని అనుసరించాలని స్పష్టం చేసింది.

EPFO UPI withdrawal: ట్రయల్ రన్ స్టార్ట్! ఏకంగా 75 శాతం డబ్బులు డ్రా..
EPFO UPI withdrawal: ట్రయల్ రన్ స్టార్ట్! ఏకంగా 75 శాతం డబ్బులు డ్రా..

నిపుణుల అభిప్రాయం ప్రకారం తీర్పు అసలు అర్థం ఏమిటి?

ఈ తీర్పును పరిశ్రమ నిపుణులు ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ఎగ్సెంప్టెడ్ ఎస్టాబ్లిష్‌మెంట్లలోని ప్రతి ఒక్క ఉద్యోగికి ఆటోమేటిక్‌గా హైయర్ పెన్షన్ వచ్చేస్తుందని దీని అర్థం కాదని, అయితే చట్టబద్ధమైన పింఛను హక్కులకు ప్రైవేట్ ట్రస్ట్ రూల్స్ అడ్డకూడదని ఈ తీర్పు నిరూపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. యజమానులు పాత రికార్డులను భద్రపరచడం ఎంత ముఖ్యమో ఈ తీర్పు మరోసారి గుర్తుచేసిందని లీగల్ నిపుణులు పేర్కొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+