సిరి సహస్రకు హైకోర్టులో భారీ షాక్- బీసీ సర్టిఫికెట్ పై కలెక్టర్ కు కీలక ఆదేశాలు..!

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, తాజాగా టీడీపీలో చేరిన మజ్జిశ్రీనివాసరావు కుమార్తె అయిన సిరి సహస్రకు (Siri Sahasra) హైకోర్టులో ఇవాళ భారీ షాక్ తగిలింది. ఆమె బీసీ కానప్పటికీ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వివాదం తేలేవరకూ ఆమె పొందుతున్న బీసీ రిజర్వేషన్ ప్రయోజనాలకు సైతం బ్రేక్ పడింది.

జగన్ కోటను కూల్చిన టీడీపీ..! ప్రతీకారం తీర్చుకున్న చంద్రబాబు..!
జగన్ కోటను కూల్చిన టీడీపీ..! ప్రతీకారం తీర్చుకున్న చంద్రబాబు..!

తాజాగా తన తండ్రి మజ్జి శ్రీనివాసరావుతో పాటు టీడీపీలో చేరిన మజ్జి సిరి సహస్ర జడ్పీటీసీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా తెర్లాం స్ధానం నుంచి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. గెలిస్తే ఆమెకు విజయనగరం జడ్పీ ఛైర్ పర్సన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ఆమె కుల ధృవీకరణ పత్రంపై వివాదం తెరపైకి వచ్చింది. ఆమె తల్లి మార్వాడీ కావడం, సిరి సహస్ర అసలు పేరు ముస్తాన్ జైన్ కావడంతో ఆమె ప్రత్యర్థులు ఇదే విషయాన్ని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.

Siri Sahasra Faces Setback in High Court Over BC Certificate Dispute
పులివెందులోనే ఎందుకిలా ? మీ ఏకగ్రీవాల సంగతేంటి? జగన్ కు లోకేష్ కౌంటర్..!
పులివెందులోనే ఎందుకిలా ? మీ ఏకగ్రీవాల సంగతేంటి? జగన్ కు లోకేష్ కౌంటర్..!


ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఓసీ కులానికి చెందిన సిరి సహస్ర బీసీ సర్టిఫికెట్‌తో నామినేషన్ వేసినట్లు వైసీపీ అభ్యర్థి బొమ్మి శ్రీనివాసరావు అభ్యంతరం తెలుపుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు ఈ వివాదం తేలేవరకూ బీసీ సర్టిఫికెట్‌తో సిరి సహస్ర రిజర్వేషన్ ప్రయోజనాలు పొందకుండా మధ్యంతర ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో బీసీగా నామినేషన్ వేసిన సిరి సహస్ర పోటీపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆమె బీసీ ప్రయోజనాలు పొందకుండా ఉండాలంటే ఎన్నికల్లో తెర్లాం స్ధానం నుంచి పోటీ చేయకూడదు. కానీ రేపు ఎన్నికలు పెట్టుకుని, ఇప్పటికిప్పుడు ఆమె పోటీకి దూరంగా ఉండే అవకాశం కూడా లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+