యూఎస్ ఆర్మీలో ఉన్నత ఉద్యోగినికి మిస్ యూనివర్స్ కిరీటం

మిస్ యూనివర్స్ కిరీటాన్ని ప్యూర్టో రికోకు చెందిన జెన్నిఫర్ బారెటో కైవసం చేసుకున్నారు. ప్యూర్టో రికోలోని సాంజువాన్‌ జోస్ మిగ్యుయెల్ అగ్రెలోట్ కొలీజియంలో జరిగిన 75వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో ఆమె ఈ విజయాన్ని అందుకున్నారు. గత ఏడాది మిస్ యూనివర్స్ విజేత, మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ జెన్నిఫర్ బారెటోకు కిరీటాన్ని అలంకరించారు. సొంత గడ్డపై జరిగిన ఈ పోటీల్లో ఆమె గెలవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

మిస్ యూనివర్స్ పోటీలు 75 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు ఈ సారి ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ పేరుతో ప్రత్యేకమైన కిరీటాన్ని ఆవిష్కరించారు. జ్యువెలరీ డిజైనర్ జార్జ్ విట్టెల్స్, పారిసియన్ జ్యువెలరీ హౌస్ మైసన్ డీఓఆర్ సంయుక్తంగా దీనిని రూపొందించాయి. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌లో ఏకంగా 3,150 వజ్రాలను అమర్చి దీన్ని తీర్చిదిద్దారు. ఈ కిరీటం ఫినాలే వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Jennifer Barreto made history as Miss Universe crown an impressive profile in San Juan Puerto Rico

ఈ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మేజో టాప్ 30 జాబితాలో చోటు సంపాదించారు.. గానీ ఫినాలే వరకు వెళ్లలేకపోయారు. లా విద్యార్థిని, మోడల్ అయిన కాజియా.. మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుచుకున్న మొదటి కేరళ యువతిగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. మిస్ యూనివర్స్ కేరళ టైటిల్ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా కూడా ఆమె నిలిచారు. స్విమ్‌సూట్ రౌండ్ తర్వాత కాజియా టాప్ 12 లోకి చేరుకోలేకపోయారు.

పెళ్లిళ్ల సీజన్ వేళ.. మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ వేళ.. మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు

ఈ పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా న్యూనెజ్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, వెనిజులా భామ క్లారా వేగాస్ గోయెట్జ్ సెకండ్ రన్నరప్‌గా ఎంపికయ్యారు. ఈ ఎడిషన్‌లో ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, వెనిజులా, డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టో రికో దేశాలు టాప్ 5 స్థానాలను దక్కించుకున్నాయి. చిలీ, యునైటెడ్ స్టేట్స్, క్యూబా, కొలంబియా, నికరాగ్వా, ఫ్రాన్స్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో టాప్ 12 రౌండ్‌కు చేరుకున్నాయి.

సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి ఏపీకి 30 సంక్రాంతి ప్రత్యేక రైళ్లు: రూట్స్, హాల్ట్ స్టేషన్లు
సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి ఏపీకి 30 సంక్రాంతి ప్రత్యేక రైళ్లు: రూట్స్, హాల్ట్ స్టేషన్లు

చివరకు జెన్నీఫర్ బారెటో విజేతగా నిలవడంతో పుఎర్టో రికో వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. జెన్నీఫర్ సైకాలజీ, క్లినికల్ సోషల్ వర్క్ విభాగాల్లో రెండు మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు. ప్రస్తుతం యూఎస్ ఆర్మీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో ప్రివెన్షన్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోన్నారు. ఆమెకు ఏడేళ్ల కుమార్తె పెనెలోప్‌ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+