ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలో సంచలనం రేపుతున్న రియల్ క్రైమ్ స్టోరీ!

ఇటీవలి కాలంలో ఓటీటీ ప్రేక్షకుల్లో క్రైమ్ థ్రిల్లర్లు, ముఖ్యంగా నిజ జీవిత నేర కథనాల ఆధారంగా రూపొందే డాక్యుమెంటరీలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ కోవలోనే కేరళను కుదిపేసిన ఒక సంచలన హత్యల పరంపర ఆధారంగా తెరకెక్కిన 'కర్రీ అండ్ సైనైడ్: ది జాలీ జోసెఫ్ కేస్' డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. విడుదలైన కొద్దిరోజుల్లోనే సుమారు 30 దేశాల్లో టాప్-3 ట్రెండింగ్ జాబితాలో నిలిచి ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

'ఆదర్శ కుటుంబం' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. వెంకీ ఫ్యాన్స్ గెట్ రెడీ..
'ఆదర్శ కుటుంబం' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. వెంకీ ఫ్యాన్స్ గెట్ రెడీ..

14 ఏళ్ల పాటు సాగిన రహస్య హత్యల పరంపర

కేరళలోని కూడతాయ్ ప్రాంతానికి చెందిన జాలీ జోసెఫ్ అనే మహిళ 2002 నుంచి 2016 మధ్య తన సొంత కుటుంబ సభ్యులే లక్ష్యంగా ఏకంగా ఆరు హత్యలకు పాల్పడింది. ఈ మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటం అప్పట్లో దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. దాదాపు 14 ఏళ్ల పాటు ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా, అత్యంత చాకచక్యంగా ఆహారంలో సైనైడ్ కలిపి ఈ ఘాతుకాలకు పాల్పడింది. సహజ మరణాలుగా అందరూ నమ్మిన ఈ ఘటనల వెనుక ఉన్న అసలు నిజం సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చింది.

Curry and Cyanide A true-crime documentary that is creating a sensation on OTT platforms worldwide

డాక్యుమెంటరీలో ఏం చూపించారు?

జాతీయ అవార్డు గ్రహీత క్రిస్టో టామీ దర్శకత్వంలో రూపొందిన ఈ డాక్యుమెంటరీ 2023 డిసెంబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కేసును ఛేదించిన దర్యాప్తు అధికారి కేజీ సైమన్, బాధిత కుటుంబ సభ్యులు రోజో థామస్, రెంజి విల్సన్, న్యాయవాది బీఏ అలూర్, జర్నలిస్ట్ నిఖిలా హెన్రీ తదితరుల ప్రత్యక్ష కథనాలు, పోలీసు దర్యాప్తు వివరాలను ఎంతో ఉత్కంఠభరితంగా చూపించారు.

18 ఏళ్ల జర్నీకి కొత్త మలుపు.. ఓటీటీ ఎంట్రీతో సంచలనం!
18 ఏళ్ల జర్నీకి కొత్త మలుపు.. ఓటీటీ ఎంట్రీతో సంచలనం!

ఆకట్టుకుంటున్న కథనం

ఒక సాధారణ గృహిణిలా కనిపిస్తూనే, ఏళ్ల తరబడి ఇంతటి దారుణాలకు జాలీ జోసెఫ్ ఎందుకు ఒడిగట్టింది? అసలు ఆ ఆరు మరణాల వెనుక ఉన్న ఆర్థిక, వ్యక్తిగత కారణాలు ఏంటి? పోలీసులకు చిన్న ఆధారం కూడా దొరక్కుండా జాగ్రత్త పడిన ఆమె, చివరకు ఎలా పట్టుబడింది? ఈ నేరాల వెనుక ఇంకెవరి హస్తమైనా ఉందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ సాగే ఈ డాక్యుమెంటరీ, నిజ జీవిత క్రైమ్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+