18 ఏళ్ల జర్నీకి కొత్త మలుపు.. ఓటీటీ ఎంట్రీతో సంచలనం!

గత 18 ఏళ్లుగా బుల్లితెరపై 'ద ట్రావెలర్' పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ ట్రావెల్ ఆధారిత కార్యక్రమం 'విహారి' ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతోంది. సొంతంగా ఓటీటీ యాప్‌ను సరికొత్త రూపంలో తీసుకువస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ యాప్ ప్రోమోను ఘనంగా ఆవిష్కరించారు. వ్యవస్థాపకుడు, దర్శకుడు ఏఎల్ నితిన్ ఈ యాప్‌ను రూపొందించగా.. వచ్చే నవంబర్ నెలలో యాప్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

చిరంజీవి - మహేష్‌బాబు కాంబినేషన్‌లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ
చిరంజీవి - మహేష్‌బాబు కాంబినేషన్‌లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ

2004లో 'మా టీవీ' ద్వారా ప్రయాణాన్ని ప్రారంభించి విహారి.. ఎన్నో మైలురాళ్లను అధిగమించి తెలుగువారికి అత్యంత ప్రియమైన ట్రావెల్ షోగా గుర్తింపు పొందింది. గతంలో కరుణ, స్నిగ్ధ వంటి ప్రముఖ యాంకర్లతో ఆకట్టుకునే ఎపిసోడ్స్ అందించగా.. డీవీడీలు, ఫుడ్ గైడ్ల ద్వారా కూడా విశేశ ప్రాచుర్యం పొందింది. ఇకపై నవంబర్ నుంచి ప్రముఖ యాంకర్ సుమతో అత్యంత సృజనాత్మకమైన ఎపిసోడ్లను టెలికాస్ట్ చేయడమే కాకుండా, ఓటీటీ యాప్‌కు ఫేస్ అండ్ హోస్ట్‌గా నటి శ్రీ సత్యను తీసుకున్నారు. ప్రస్తుతం ఓటీటీకి సంబంధించిన ప్రోమో లాంచ్ జరగగా.. నవంబర్‌లో ఓటీటీ లాంచ్ అవుతుంది. ఈ వేడుకలో సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్, వజ్ర కన్స్ట్రక్షన్స్ రాజు, శ్వేతలతో పాటు టీటీఎఫ్, వేగా జ్యువెలర్స్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

18 Years of Vihari OTT app launch Popular Travel Show Enters Digital Space Director AL Nithin announces full launch

ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్ మాట్లాడుతూ.. "విహారి కాన్సెప్ట్ వినగానే చాలా నచ్చింది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా ఈ షోను ఎంతగానో ఆదరించారు. సమాచార నిధిగా నిలిచిన విహారి ఓటీటీ యాప్ కూడా గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను" అన్నారు. అలాగే వజ్ర కన్స్ట్రక్షన్స్ శ్వేత, రాజు మాట్లాడుతూ.. విహారి ట్రావెల్ షో స్పూర్తితోనే ఎంతోమంది ప్రయాణాలు ప్రారంభించారని, అటువంటి బ్రాండ్‌తో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

రామాయణ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
రామాయణ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

దర్శకుడు, అధినేత ఏఎల్ నితిన్ మాట్లాడుతూ.. "గత 18 ఏళ్లుగా నన్ను, నా ప్రాజెక్ట్‌ను ప్రోత్సహిస్తున్న సహచరులకు, స్పాన్సర్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఓటీటీ కోసం సరైన హోస్ట్ కోసం వెతుకుతున్నప్పుడు శ్రీ సత్య గుర్తుకొచ్చారు. ఆమె కమిట్మెంట్, డెడికేషన్ ఈ యాప్‌కి ఎంతో ప్లస్ అవుతాయి" అని పేర్కొన్నారు. హోస్ట్ శ్రీ సత్య మాట్లాడుతూ.. "మొదటిసారిగా ఒక షోకు హోస్ట్‌గా వ్యవహరించడం కాస్త భయంగా అనిపించినా నితిన్ ఎంతో సపోర్ట్ చేశారు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కడ బస చేయాలి, మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రదేశాలు సందర్శించాలి అనే సమగ్ర సమాచారాన్ని విహారి అందిస్తుంది" అని సంతోషం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+