సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన తమిళనాడు ప్రభుత్వం

మధురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద దీపత్తూణ్ రాతిస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించాలన్న ఆదేశాలను అమలు చేయలేకపోయామని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు మధురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ ఆదేశాలను నెరవేర్చలేకపోయినందుకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు తెలిపారు. దీనికి గల కారణాలను కూడా ఆయన ఇందులో వివరించారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నెరవేర్చడానికి జిల్లా యంత్రాంగం అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ, సంప్రదాయాలు, ధార్మిక నియమాల దృష్ట్యా ఆలయ యాజమాన్యం దీనికి అనుమతించలేదని మధురై కలెక్టర్ తెలిపారు. వారి అభ్యంతరాలు, మనోభావాలను గౌరవించక తప్పలేదని వివరించారు. స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. దాన్ని అమలు చేయలేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తోన్నానని ఈ అఫిడవిట్ లో పేర్కొన్నారు.

Tamil Nadu told Supreme Court that stone pillar Thiruparankundram hill could not be complied lit

జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎన్ పంచోలీతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ విషయంపై విచారణ చేపట్టింది. కార్తీక దీపం రోజున సుప్రీంకోర్టు సూచించిన వివాదాస్పద దీపత్తూణ్ వద్ద కాకుండా పూజారులు సాంప్రదాయబద్ధంగా ఉచ్చిపిళ్లైయార్ ఆలయం సమీపంలోని గల మంటపంలోనే దీపాన్ని వెలిగించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ వేలంలో తండ్రికొడుకులు- నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ లో ఆల్‌రౌండర్
ఐపీఎల్ వేలంలో తండ్రికొడుకులు- నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ లో ఆల్‌రౌండర్

అంతకుముందే ఆలయ ధర్మకర్తల మండలి ఈ విషయంపై ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని, పాత ఆచారాలను కాదని, నూతనంగా వేరే ప్రదేశంలో దీపం పెట్టడం వల్ల శతాబ్దాల నాటి ధార్మిక నియమాలు ఉల్లంఘనకు గురవుతాయని పాలక మండలి సూచించిందని కలెక్టర్ వివరించారు. వీటిని గౌరవించక తప్పలేదని, అందుకే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. వాటిని అమలు చేయలేకపోయామని అన్నారు.

చెన్నై రూపురేఖలు మార్చే ప్రాజెక్టులను ప్రారంభించిన విజయ్
చెన్నై రూపురేఖలు మార్చే ప్రాజెక్టులను ప్రారంభించిన విజయ్

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన బెంచ్.. తమిళనాడు ప్రభుత్వంపై సుమోటో కింద కోర్టు ధిక్కార చర్యలు చేపట్టడానికి నిరాకరించింది. పిటిషనర్లు విడిగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చింది. దీనిపై పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది గురు కృష్ణకుమార్ స్పందించారు. ఆదేశాలను పాటించనందుకు తమిళనాడు ప్రభుత్వంపై త్వరలోనే ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు.

షేక్ హసీనా రిటర్న్- బంగ్లాదేశ్ ఫుల్ లాక్‌డౌన్
షేక్ హసీనా రిటర్న్- బంగ్లాదేశ్ ఫుల్ లాక్‌డౌన్

నిజానికి.. ఈ దీపత్తూణ్ అనేది బ్రిటీష్ హయాంలో సరిహద్దులను గుర్తించడానికి ఏర్పాటు చేసిన ఒక సర్వే రాయి మాత్రమేనని, అక్కడ దీపం వెలిగించే సంప్రదాయం ఆలయ చరిత్రలో ఎప్పుడూ లేదని పాలక మండలి చెబుతోంది. సంప్రదాయబద్ధంగా ఉచ్చిపిళ్లైయార్ ఆలయ ప్రాంతంలోనే దీపం వెలిగించడం తరతరాలుగా వస్తున్న పద్ధతి అని తెలిపింది. ఈ ధార్మిక నియమాలు, సంప్రదాయాలకు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+