ఐపీఎల్ వేలంలో తండ్రికొడుకులు- నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ లో ఆల్‌రౌండర్

ఐపీఎల్ వేలం చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టానికి తెరలేవబోతోంది. లీగ్ చరిత్రలో మొదటిసారిగా ఒకే వేలంలో తండ్రీకొడుకులు పాల్గొనబోతోన్నారు. తమ పేర్లను కూడా నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 16వ తేదీన గోవా వేదికగా జరగబోయే వేలం పాటలో వీరిద్దరే ప్రధాన ఆకర్షణగా మారబోతోన్నారు. ఏ ఫ్రాంఛైజీ వీరిని కొనుగోలు చేస్తుందనేది చర్చనీయాంశమౌతోంది. టీ20 ఫార్మాట్ వేలం చరిత్రలో ఒకేసారి తండ్రీకొడుకులు పోటీపడటం ఇదే మొదటిసారి కూడా.

ఈ ఆక్షన్ కోసం మొత్తం 1,220 మంది ప్లేయర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీతో పాటు ఆయన కుమారుడు హసన్ ఈసాఖిల్ కూడా ఈ సారి వేలం బరిలో నిలిచాడు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో అపార అనుభవం ఉన్న మహమ్మద్ నబీ కోటి రూపాయల బేస్ ప్రైస్ కేటగిరీలో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇటీవలే ఆఫ్ఘనిస్థాన్ జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన హసన్ ఈసాఖిల్ తన బేస్ ప్రైస్‌ను రూ. 75 లక్షలుగా ఖరారు చేశాడు.

For the first time in IPL auction history a father and son duo has registered for the same auction

ఐపీఎల్‌లో ఆడిన సుదీర్ఘ అనుభవం ఉంది.. నబీకి. 2017 సీజన్ ద్వారా లీగ్‌లోకి అడుగుపెట్టిన అతను ఆరంభంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయిదు సీజన్ల పాటు కొనసాగాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులోనూ భాగం అయ్యాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడిన నబీ.. బ్యాటింగ్‌లో 215 పరుగులు చేయడంతో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో 15 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఊపిరి పీల్చుకో
సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఊపిరి పీల్చుకో

అతని కుమారుడు హసన్ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఈ ఏడాదే ఆఫ్ఘనిస్థాన్ జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడుతున్నాడు. టీ20 లీగ్‌లలో కూడా రాణించాలని పట్టుదలతో ఉన్నాడు. వేలంలో ఈ తండ్రీకొడుకుల జోడీకి ఏ విధమైన ఆదరణ లభిస్తుందనేది చర్చనీయాంశమౌతోంది. విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు పొందిన హసన్. తండ్రి బాటలోనే ఐపీఎల్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.

షేక్ హసీనా రిటర్న్- బంగ్లాదేశ్ ఫుల్ లాక్‌డౌన్
షేక్ హసీనా రిటర్న్- బంగ్లాదేశ్ ఫుల్ లాక్‌డౌన్

బీసీసీఐ విడుదల చేసిన వివరాల ప్రకారం.. 939 మంది భారతీయులు, 281 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో 170 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 42 మంది అసోసియేట్ దేశాలకు చెందినవాళ్లు ఉన్నారు. మిగిలిన వారు ఇంకా అంతర్జాతీయంగా అరంగేట్రం చేయని అన్‌క్యాప్డ్ క్రికెటర్లుగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 66 మందిని మాత్రమే తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో కాంపిటీషన్ గట్టిగానే ఉండొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+