సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఊపిరి పీల్చుకో
ఐపీఎల్ లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉండటంపై నెలకొన్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కత నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట లభించింది. ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఫాస్ట్ బౌలర్లు పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, కామెరాన్ గ్రీన్ రాబోయే టోర్నీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాత్రం ఈ సీజన్ ఆడకపోవచ్చు.
డిసెంబర్ 16న గోవా వేదికగా మినీ వేలం జరగనున్న నేపథ్యంలో, ఈ ఇద్దరు సీనియర్ అంతర్జాతీయ ఆటగాళ్ల లభ్యతపై స్పష్టత రావడం ఈ మూడు ఫ్రాంఛైజీ యాజమాన్యాలకు ప్లస్ పాయింట్ అయింది. కెప్టెన్ పాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 18 కోట్లకు నిలుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ మొత్తానికీ అతను దూరం అవుతాడంటూ మొదట్లో వార్తలొచ్చాయి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని క్రికెట ఆస్ట్రేలియా తెలిపింది.

తాజాగా ఐపీఎల్ ఆడటంపై సంసిద్ధత వ్యక్తం చేశాడు.. పాట్ కమ్మిన్స్. రాబోయే సీజన్‌లో అందుబాటులో ఉంటాడని జట్టు వర్గాలు స్పష్టం చేశాయి. దీనిపై క్రిక్ బజ్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కమిన్స్ వెన్నునొప్పితో బాధపడ్డ విషయం తెలిసిందే. దాని నుంచి కోలుకున్న తర్వాత ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ సమయంలో ఇషాన్ కిషన్ తాత్కాలికంగా జట్టును నడిపించారు.
ఒకవేళ పాట్ కమిన్స్ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా కొన్ని మ్యాచ్‌కు దూరమైనా పేస్ బౌలింగ్ విభాగం బలహీనపడకుండా ఉండటానికి ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే వ్యూహాత్మక అడుగులు వేసింది. ప్లేయర్ ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, టీ నటరాజన్ ను జట్టులోకి తీసుకుంది. దీని వల్ల కమిన్స్ లేని సమయంలో కూడా జట్టు పేస్ బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంటుంది.
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కూడా జోష్ హేజిల్‌వుడ్ రూపంలో బిగ్ అప్‌డేట్ అందింది. రూ. 12.5 కోట్లకు ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్ కు పూర్తిగా అందుబాటులో ఉండబోతోన్నాడు. ఈ మేరకు ఫ్రాంచైజీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 52 మ్యాచ్‌లు ఆడిన హేజిల్‌వుడ్ 23.47 సగటుతో 72 వికెట్లు పడగొట్టాడె. స్వింగ్ తో మెరుపులు మెరిపించడం, డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడంలో ఆర్‌సీబీకి ప్రధాన ఆయుధం.
ఆస్ట్రేలియాకే చెందిన కోల్ కత నైట్ రైడర్స్ కామెరాన్ గ్రీన్ కూడా రాబోయే సీజన్ కు అందుబాటులోకి వచ్చాడు. ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్ లల్లో 322 పరుగులు చేశాడీ ఆల్ రౌండర్. అతని వ్యక్తిగత అత్యధిక పరుగులు.. 79. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 145. 20 స్ట్రైక్ రేట్ తో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు.












Click it and Unblock the Notifications
