సికింద్రాబాద్, ఏపీ మీదుగా కొల్లం ప్రత్యేక రైలు: అరుణాచలం, శ్రీరంగం కవర్ చెయ్యొచ్చు
మండలం- మకరవిళక్కు యాత్రా కాలం ప్రారంభం కావడంతో శబరిమలలో వెలిసిన అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివెళ్తోన్నారు ప్రజలు. డిసెంబర్ 27వ తేదీ వరకు మండలం, ఆ తర్వాత 30వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు మకరవిళక్కు సీజన్ కొనసాగనుంది. ఈ యాత్రా కాలం ఆరంభం కావడంతో కేరళ పతనంతిట్ట కొండల్లో పండగ వాతావరణం నెలకొంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు.
అయ్యప్పస్వామి భక్తుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని వివిధ స్టేషన్లకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. హైదరాబాద్, చర్లపల్లి, శ్రీకాకుళం నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. రోజురోజుకూ అయ్యప్ప మాలధారుల రద్దీ ఎక్కవ అవుతోండటంతో వారికి మరింత సౌకర్యాన్ని కల్పించడంలో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోన్నారు.

- ఈ క్రమంలో హుజూర్ సాహిబ్ నాందెడ్ నుంచి కొల్లం స్టేషన్ కు ప్రత్యేక రైలును ప్రకటించారు. డిసెంబర్ 7వ తేదీన పట్టాలెక్కబోతోందీ ఎక్స్ ప్రెస్. జనవరి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
- డిసెంబర్ 7 నుంచి జనవరి 11వ తేదీ వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నాందెడ్ నుంచి బయలుదేరే నంబర్ 07687 ప్రత్యేక రైలు రెండో రోజు తెల్లవారు జామున 6 గంటలకు కొల్లం చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 9 నుంచి జనవరి 13వ తేదీ వరకు ప్రతి బుధవారం ఉదయం 9:30 గంటలకు కొల్లం నుంచి బయలుదేరే నంబర్ 07688 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 11 గంటలకు నాందెడ్ కు చేరుకుంటుంది.
- ముద్ఖేడ్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, విరుధాచలం, అరియలూరు, శ్రీరంగం, తిరుచిరాపల్లి, డిండిగల్, మధురై, విరుధునగర్, శివకాశి, శ్రీవిల్లిపుత్తూరు, రాజపాళయం, శంకరకోవిల్, కడయనల్లూరు, తెన్ కాశి, సెంగొట్టై, పూనలూరు, కొట్టక్కార మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications
