శ్రీవారికి భక్తుడి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక, టీటీడీ చరిత్రలో తొలిసారి..!!

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా అందిస్తున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. విరాళం విలువ రూ.160 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పేరు వెల్లడించడానికి ఇష్టపడని అజ్ఞాత భక్తుడు మొత్తం తొమ్మిది ప్రత్యేక సెట్లలో 45 రకాల ఆభరణాల రూపకల్పన చేయించారు. నవంబర్ 26న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా తిరుమలలో టీటీడీకి సమర్పించనున్నారు. టీటీడీ చరిత్రలోనే ఈ విరాళం అతి పెద్దదిగా చెబుతున్నారు.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు అరుదైన, అత్యంత భారీ కానుకను ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను శ్రీవారికి విరాళంగా ప్రకటించారు. ఈ నెల 26న (2026 నవంబర్ 26) ఈ ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి అధికారికంగా అందజేయనున్నారు. ప్రస్తుతం మార్కెట్ లెక్కల ప్రకారం ఈ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ160 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్వామివారి కోసం మొత్తం 45 రకాల స్వర్ణాభరణాలను 9 ప్రత్యేక సెట్లుగా అత్యంత నైపుణ్యంతో తయారు చేయించారు. ఈ భారీ విరాళాన్ని అందజేస్తున్న భక్తుడు తన పేరును, వ్యక్తిగత వివరాలను వెల్లడించడానికి ఏమాత్రం ఇష్టపడలేదని సమాచారం. గోప్యత పాటిస్తూ పూర్తిగా స్వామివారి భక్తి ప్రపత్తులతోనే ఈ విరాళాన్ని అందజేస్తున్నారు. ఒక కంపెనీ స్థాపించి వ్యాపారం లో రాణించిన ఆ భక్తుడు ఇప్పుడు కొంత వాటా శ్రీవారికి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కొంత కాలం క్రితం సీఎం చంద్రబాబుతో పంచుకున్నారు.

 విశాఖ- తిరుపతి వందేభారత్ సిద్దం: హాల్టింగ్ స్టేషన్లు, టైమింగ్స్..!!
విశాఖ- తిరుపతి వందేభారత్ సిద్దం: హాల్టింగ్ స్టేషన్లు, టైమింగ్స్..!!
ttd-devotee-to-donate-121-kg-gold-ornaments-worth-rs-160-crore-to-lord-venkateswara-details-here

121 కిలోల ఆభరణాల సమర్ఫణ వెనుక

కాగా, సీఎం చంద్రబాబు ఇదే విషయాన్ని ఆ భక్తుడు పేరు వెల్లడించకుండానే విరాళం సంగతి వెల్లడించారు. ఇప్పుడు ఆ భక్తుడు ఈ నెల 26న చంద్రబాబు చేతుల మీదుగా టీటీడీకీ ఈ విరాళం అందించనున్నారు. అయితే.. ఈ 121 కిలోల ఆభరణాల సమర్పణ వెనుక ఒక ప్రత్యేక విశేషం ఉంది. తిరుమల శ్రీవారి మూలవిరాట్‌కు నిత్య అలంకరణలో ఉపయోగించే బంగారు ఆభరణాల మొత్తం బరువు సుమారు 120 కిలోల వరకు ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న ఆ భక్తుడు, మూలవిరాట్ అలంకరణకు సరిపోయేలా 120 కిలోలకు అదనంగా మరో కిలో కలిపి మొత్తం 121 కిలోల బంగారంతో విశేష ఆభరణాలను సిద్ధం చేయాలని సంకల్పించారు. ఈ భారీ కానుక సమర్పణకు సంబంధించి ఇప్పటికే టీటీడీ అధికారులతో సంప్రదింపులు పూర్తి చేసారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు, ప్రక్రియలపై టీటీడీతో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. 121 కిలోల బంగారంతో తయారు చేసిన 45 ఆభరణాలు, 9 సెట్లుగా స్వామివారికి చేరనుండటంతో ఈ కానుకకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఈ స్థాయిలో విరాళం టీటీడీ చరిత్రలోనే తొలి సారి కావటంతో భక్తుల్లో ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+