ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
'దృశ్యం' మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది. అయితే తొలుత ఈ మూవీ మలయాళంలో విడుదలైంది. ఇందులో మోహన్ లాల్ నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులోనూ అదే టైటిల్ తో తెలుగులో విక్టరీ వెంకటేశ్ నటించారు. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ తర్వాత వచ్చిన దృశ్యం 2 మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2026 లో వచ్చిన దృశ్యం 3 మూవీ కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే మలయాళంలో వచ్చిన దృశ్యం 3 మూవీలో ఎలాంటి కన్ క్లూజన్ ఇవ్వలేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ ఇటీవల నటించిన 'దృశ్యం: ది కన్ క్లూజన్' మూవీలో మొత్తానికి దృశ్యం మూవీ స్టోరీకి ఎండ్ కార్డ్ పడింది. దాంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే థియేటర్లలో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు ముందు కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురైన సంగతి తెలిసిందే.. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేయడంతో అధికారికంగా ఓటీటీ డేట్ ను ఖరారు చేసింది.

అజయ్ దేవ్ గణ్ తో పాటు టబు, శ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ నవంబర్ 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఇక ఈ సినిమాకు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. దృశ్యం, దృశ్యం 2 సినిమాకు కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ మూవీ ద్వారా దృశ్యం కథకు ఎండ్ కార్డ్ ఇచ్చారు దర్శకుడు అభిషేక్ పాఠక్. ఇక ఈ మూవీ 2026 లో బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో సినిమాగా రికార్డ్ నమోదు చేసింది. అయితే ఈ మూవీ నవంబర్ 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications
