తెలంగాణ ఉద్యమకారులకు తీపికబురు.. గుర్తింపు కోసం త్వరలోనే ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులకు తగిన గౌరవం, అధికారిక గుర్తింపు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అర్హులైన ఉద్యమకారుల వివరాలను నమోదు చేసుకునేందుకు ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది.

శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నివాసంలో ఈ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ కె. కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, మోతె శోభన్‌ రెడ్డి, శ్యామ్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో ఇప్పటివరకు జరిగిన పురోగతిని సభ్యులు సమీక్షించారు.

Good News for Telangana Activists Dedicated Website for telangana activists Official Recognition to Launch Soon

వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులు, కళాకారులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో ఇప్పటికే నిర్వహించిన సంప్రదింపుల వివరాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా సాగాలంటే ఆన్‌లైన్‌ నమోదు కీలకమని కమిటీ అభిప్రాయపడింది. ఇందుకోసం రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్‌సైట్‌ ప్రస్తుత స్థితిగతులను పరిశీలించి, త్వరలోనే దాని ప్రారంభ తేదీని ప్రకటించాలని సభ్యులు నిర్ణయించారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలతో పాటు, ఉద్యమ సమయంలో జైలు జీవితం గడిపిన వారు, పోలీసు కేసులు ఎదుర్కొన్న వారు, గాయపడిన వారిని అధికారికంగా గుర్తించాలనే డిమాండ్‌ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఈ ఆకాంక్షను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మే 2026లో సాధారణ పరిపాలన శాఖ ద్వారా జీఓ ఆర్టీ నంబర్ 679 జారీ చేసి, డాక్టర్‌ కేశవరావు సారథ్యంలో ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త!
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త!

త్వరలో ప్రారంభం కానున్న ఈ వెబ్‌సైట్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారందరూ తమ వివరాలు, తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం, కమిటీ రూపొందించిన స్పష్టమైన ప్రమాణాల ప్రకారం అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత వారికి అందించాల్సిన గుర్తింపు కార్డులు, గౌరవం, సంక్షేమ సౌకర్యాలపై కమిటీ ప్రభుత్వానికి తుది సిఫార్సులు అందజేయనుంది. తెలంగాణ సాధనలో తమ జీవితాలను పణంగా పెట్టిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే లక్ష్యంగా కమిటీ పనిచేస్తోందని, త్వరలోనే తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+