ధురంధర్ కు అవార్డుల పంట.. ఉత్తమ నటుడు ఎవరంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్- ఆదిత్య ధార్ కాంబోలో తెరకెక్కిన 'ధురంధర్' మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. గతేడాది డిసెంబర్ 05న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ మూవీ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 లో అవార్డుల మోత మోగించింది. తాజాగా ఈ మూవీ ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. అంతేకాక ఉత్తమ నటుడిగా రణ్ వీర్ సింగ్ కు అవార్డు లభించింది. అలాగే ధురంధర్ సినిమాను తెరకెక్కించిన ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కావడం విశేషం.
ఇక ధురంధర్ సినిమాకు సీక్వెల్ గా ధురంధర్ 2 సినిమా మార్చి 19న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఉత్తమ నటి అవార్డును అనీత్ పడ్డాకు లభించింది. ఆమె 2025 లో సైయారా సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఛావా సినిమాకు ఉత్తమ సహాయ నటుడుగా వినీత్ కుమార్ సింగ్ అవార్డు దక్కించుకున్నారు. క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ కాంతార చాప్టర్ 1 సినిమాకు క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు దక్కింది.

ఇక భారతీయ సినిమా పితామహుడిగా దాదాసాహెబ్ ఫాల్కే ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా భారతీయ సినిమా, వినోద రంగంలో ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ పురస్కారం అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications
