ఉత్తరాంధ్రలోనూ పట్టు బిగిస్తున్న జనసేన - టార్గెట్ 2029..!!

జనసేన గోదావరి జిల్లాలకే కాదు.. ఉత్తరాంధ్రలోనూ బలం పెంచుకుంటోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. కూటమిలో కొనసాగుతూనే తమ స్థానం సుస్థిరం చేసు కొనే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పార్టీ ఏకంగా మూడు జిల్లాల్లో తమ పట్టు నిరూపించుకుంటోంది. మిత్రపక్షాల సహకారంతో మూడు జెడ్పీ స్థానాలను సొంతం చేసుకుంది. దీంతో.. 2029 ఎన్నికల నాటికి సీట్ల కేటాయింపులో తమ పట్టు మరింత పెంచుకుంటోంది. ఇప్పుడు ఈ పరిణామాలే కూటమిలో కీలక చర్చగా మారుతున్నాయి.

జనసేన బలం గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్రలోనూ క్రమేణా విస్తరిస్తోంది. 2024 ఎన్నిక ల్లో జనసేన గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఉత్తరాంధ్ర నుంచి గెలిచారు. విజయవాడ లో స్థానిక ఎన్నికల్లో ఏరి కోరి మేయర్ గా వంగవీటి రాధాను బరిలోకి దింపు అక్కడ తొలి సారి పార్టీ జెండా ఎగుర వేసారు. ఏలూరు మేయర్ స్థానం గెలుచుకుంది. ఇక, ఇప్పుడు కాకినాడ, శ్రీకాకుళం మేయర్ సీట్ల కోసం పోటీ పడుతోంది. కాగా.. ఉత్తరాంధ్రలో మూడు జెడ్పీ స్థానాలు ఇప్పుడు జనసేన ఖాతాలోకి వచ్చాయి.

పవన్ మాటిచ్చారు..వెనక్కి తగ్గండి..! లోకేష్ ను కోరిన జనసేన నేత కోట వినుత..!
పవన్ మాటిచ్చారు..వెనక్కి తగ్గండి..! లోకేష్ ను కోరిన జనసేన నేత కోట వినుత..!
Janasena Tightens Its Grip in North Andhra Local Body Elections Secures Three Districts

ఈ జిల్లాలో కూటమి పొత్తులో భాగంగా మేయర్ పదవితో పాటు జిల్లా పరిషత్ పీఠం కూడా జనసేనకు కేటాయించారు. దాంతో ఇక్కడ తమకు జిల్లాలో పెద్ద పదవి ఏదీ దక్కలేద నే చర్చ టీడీపీలో వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో విశాఖలో 2024 ఎన్నికల్లోనే జనసేన ఎమ్మెల్యేలు పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా జనసేన బలం నిరూపించుకుంది. ఈ జిల్లా జెడ్పీ పీఠం జనసేన సొంతం చేసుకుంది.

కాగా, ఇప్పటికే జనసేనకు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మల జయక్రిష్ణ ఉన్నారు. ఈ జిల్లాలో మొత్తం 15 జెడ్పీటీసీలు ఉంటే అందులో టీడీపీ ఏడు వైసీపీ అయిదు, జనసేన మూడు గెలిచాయి. ఇదే జిల్లాలో సాలూరు మునిసిపల్ చైర్మన్ పీఠం కూడా జనసేన అందుకుంది. అదే విధంగా అనకాపల్లి జడ్పీ చైర్ పర్సన్ పీఠాన్ని జనసేన తమ ఖాతాలో వేసుకుంది. మొత్తం 24 జడ్పీటీసీలు ఉన్న అనకాపల్లి జిల్లాలో మొత్తానికి మొత్తం కూటమి పార్టీలే గెలుచుకున్నాయి.

 జడ్పీ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు, పవన్ ఏరి కోరి ఎంపిక..!!
జడ్పీ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు, పవన్ ఏరి కోరి ఎంపిక..!!

ఇక్కడ అనకాపల్లి, ఎల మంచిలి నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలా.. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో బలం చాటుకుంటున్న జనసేన 2029 ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేసేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. డీలిమిటేషన్ జరిగిన సీట్లు పెరిగినా.. ప్రస్తుత సీట్ల సంఖ్యతోనే ఎన్నికలు జరిగినా.. తమ బలం చాటుకుంటూ.. ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే నిర్ణయాత్మక స్థాయి లో జనసేన ఎదిగిందనే విశ్లేషణలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+