జడ్పీ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు, పవన్ ఏరి కోరి ఎంపిక..!!

జనసేన జెడ్పీ ఛైర్మన్ అభ్యర్ధులు ఖరారయ్యారు. జనసేనాని పవన్ ఏరి కోరి ఎంపిక చేసారు. తాజా గా కూటమి నేతల చర్చల్లో భాగంగా జనసేనకు నాలుగు జెడ్పీ ఛైర్మన్ పదవులు దక్కాయి. తొలుత ఏడు సీట్ల వరకు జనసేన డిమాండ్ చేసింది. అయితే, తుది చర్చల్లో జనసేనకు నాలుగు దక్కగా.. పలు చోట్ల వైస్ ఛైర్మన్ పదవులు కేటాయించారు. దీంతో.. పవన్ తమకు కేటాయించిన జిల్లాల్లో జెడ్పీ ఛైర్మన్ స్థానాల్లో నాలుగు సీట్లు మహిళలకు కేటాయించారు. వైస్ ఛైర్మన్ అభ్యర్ధులను ప్రకటించారు.

కూటమి పొత్తుల లెక్కల్లో భాగంగా జనసేనకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు దక్కాయి. ఈ జిల్లాల్లో సుదీర్ఘ కసరత్తు తరువాత పార్టీ అధినేత పవన్ జెడ్పీ ఛైర్మన్ అభ్యర్ధులను ప్రకటించారు. వీరితో పాటుగా అయిదు జిల్లాలకు సంబంధించిన వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు. జెడ్పీ ఛైర్మన్ అభ్యర్ధులుగా శ్రీకాకుళం జిల్లా నుంచి కొరికాన భవాని (ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ)ని ఖరారు చేసారు. పార్వతీపురం మన్యంకు నిమ్మల నీలిమ (భామిని జడ్పీటీసీ) పేరు ప్రకటించారు. అనకాపల్లి నుంచి మోటూరు నాగమణి (పరవాడ జడ్పీటీసీ) కు అవకాశం కల్పించారు. ఇక.. కాకినాడ జెడ్పీ ఛైర్ పర్సన్ గా బుర్రా దివ్య సునీత రాజ్ (పెద్దాపురం)ను పవన్ ఎంపిక చేసారు.

సీనియర్లను రంగంలోకి దించిన పవన్, కీలక మలుపు..!!
సీనియర్లను రంగంలోకి దించిన పవన్, కీలక మలుపు..!!
pawan-kalyan-announces-jana-sena-candidates-for-four-zp-chairperson-posts-here-the-list

నాలుగు జెడ్పీలు మహిళలకు కేటాయింపు

కాగా, అయిదు జిల్లాల్లో వైస్ చైర్మన్లను పవన్ ప్రకటించారు. వారిలో తూర్పు గోదావరి: పల్నాటి రజని (నిడదవోలు), డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ: ఎలిశెట్టి రామకృష్ణ (కొత్తపేట), బాపట్ల: కలవ కూరి పిచ్చమ్మ (పర్చూరు), ప్రకాశం: వరికూటి లక్ష్మీ తాయారు (దర్శి), సత్యసాయి జిల్లా: దాసరి సునేత్ర (గోరంట్ల) పేర్లను ఖరారు చేసారు. ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా వీరంతా తమ బాధ్యతలను స్వీకరించనున్నారు. మొత్తం 28 జెడ్పీ స్థానాల్లో వైసీపీ ఒకటి గెలవగా.. కూటమికి 27 దక్కాయి. అందులో జనసేనకు నాలుగు, బీజేపీకి ఒకటి కేటాయించారు. మిగిలిన 22 స్థానాల్లో టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. బీజేపీకి క్రిష్ణా జిల్లా జెడ్పీ పీఠం దక్కింది. ఇక.. రెండో విడత మున్సిపల్ ఎన్నికల పైన పవన్ ఫోకస్ చేసారు. సీనియర్లను రంగంలోకి దించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+