డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తే ఎంపీకి రూ.150 కోట్లు ? శివసేన ఎంపీ సంచలనం..!

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డీలిటిమిటేషన్-మహిళా బిల్లుల్ని ఉమ్మడిగా ప్రవేశపెట్టి పార్లమెంట్ లో 2/3 వంతు మెజార్టీ పొందేందుకు విఫలయత్నం చేసింది. విపక్ష ఇండియా కూటమి ఐక్యంగా ఉండటంతో ఈ బిల్లులు వీగిపోయాయి. దీంతో కేంద్రం ఈ బిల్లుల్ని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి నెగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం విపక్షాల అంచనాలకు అందకుండా పార్లమెంట్ ను ప్రోరోగ్ కాకుండా ఉంచిన కేంద్రం.. సడన్ గా సమావేశాలు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మధ్యలో విపక్ష ఎంపీల్ని తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Rajasthan Polls: దూసుపోతున్న కాంగ్రెస్ - చేతులెత్తేసిన బీజేపీ..!
Rajasthan Polls: దూసుపోతున్న కాంగ్రెస్ - చేతులెత్తేసిన బీజేపీ..!

ఇందులో భాగంగా ఒక్కో ఎంపీకి బీజేపీ రూ.150 కోట్లు ఎర వేస్తున్నట్లు శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut ) ఇవాళ బాంబు పేల్చారు. అమిత్ షా ముంబైకి తరచుగా చేస్తున్న పర్యటనల వెనుక కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎంపీల్ని ప్రలోభపెట్టేందుకే ఆయన ముంబైకి తరచుగా వస్తున్నట్లు రౌత్ తెలిపారు. ఈ చట్టానికి మద్దతునిచ్చేలా మహారాష్ట్ర నేతల్ని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ బాధ్యతను మహారాష్ట్రలోని పలువురు కీలక నేతలకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.

Shiv Sena MP Sanjay Raut Claims MPs Offered Rs 150 Crore Each to Back Delimitation Bill
రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లపై నిషేధం ? కేంద్రానికి సుప్రీం కీలక సూచన..!
రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లపై నిషేధం ? కేంద్రానికి సుప్రీం కీలక సూచన..!

రెండు రోజుల క్రితం ఈ బిల్లుకు మద్దతిచ్చే ఎంపీలకు రూ.100 కోట్ల ఆఫర్ ఇచ్చారని, అది ఇప్పుడు రూ.150 కోట్లకు చేరుకుందని సంజయ్ రౌత్ తెలిపారు. ఎంపీలను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఆయన ఏయే ఎంపీలకు ఈ మొత్తాల్ని బీజేపీ ఆఫర్ చేస్తోందో పేర్లు వెల్లడించలేదు. ఐదేళ్ల క్రితం మహారాష్ట్రలో ఒక్కో ఎమ్మెల్యేను రూ.50 కోట్లకు, ఎంపీని రూ.75 కోట్లకు కొనుగోలు చేశారని రౌత్ గుర్తుచేశారు. కాబట్టి ఇప్పుడు రూ.150 కోట్లు అనేది గౌరవప్రదమైన మొత్తమే అని రౌత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని జాతీయ స్టాక్ ఎక్చేంజ్ తో ఆయన పోల్చారు. డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేతో ఉన్న ఒక ఒప్పందంలో భాగంగా తమ పార్టీని వీడిన ఆరుగురు ఎంపీలకు ఒక్కొక్కరికి రూ.80 కోట్లు చెల్లించారని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+