రాహుల్ గాంధీకి అమిత్ షా బంపర్ ఆఫర్...! ఒప్పుకుంటే పార్లమెంట్ ప్రత్యేక భేటీ..!

కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలు, ఎస్ఐఆర్, ఓట్ల చోరీ ఆరోపణలపై జాతీయ స్దాయిలో విపక్షాలన్నింటినీ కలుపుకుని విపక్ష నేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. కేంద్రంలో నిత్యం వరుసగా ప్రశ్నలు సంధిస్తూ, విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) .. రాహుల్ గాంధీకి ఓ ఆఫర్ ఇచ్చారు. ఓట్ల చోరీపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ భేటీ ఏర్పాటు చేసేందుకు సిద్దమని ఆయన ఉత్తర్ ప్రదేశ్ లో ప్రకటించారు. అయితే ఇందుకు రాహుల్ గాంధీ వస్తారా అని ఆయన ప్రశ్నించారు.

సీఈసీ, ఎస్ఈసీల ఎంపిక అలా జరగాల్సిందే..! జగన్ కీలక డిమాండ్..!
సీఈసీ, ఎస్ఈసీల ఎంపిక అలా జరగాల్సిందే..! జగన్ కీలక డిమాండ్..!

ఓట్ల చోరీ అంశంపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కానీ రాహుల్ బాబా అందుకు ఎప్పటికీ అంగీకరించరని అమిత్ షా తెలిపారు. ఆయన పార్లమెంటులో ఈ అంశంపై చర్చించరని, పైగా వీధుల్లో గందరగోళం సృష్టిస్తారని లక్నోలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రతి ఆరోపణపై పార్లమెంటులో చర్చించాలని తాను రాహుల్, అఖిలేష్ యాదవ్ లకు సవాలు విసురుతున్నానని షా తెలిపారు. ఎన్నికల సంఘంపై ఆరోపణలు నిరాధారమైనవని, కానీ వారికి చర్చ వద్దు, వీధుల్లో నాటకాలు కావాలన్నారు.

Amit Shah Offers Special Parliament Session on Vote Theft Row Says Rahul Gandhi Won t Agree
అమిత్ షా పరువు నష్టం కేసు- రాహుల్ పై యూపీ కోర్టు కీలక తీర్పు..!
అమిత్ షా పరువు నష్టం కేసు- రాహుల్ పై యూపీ కోర్టు కీలక తీర్పు..!

ఓట్ల చోరీ ఆరోపణలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఆదివారం రామ్‌లీలా మైదానంలో భారీ నిరసన చేపట్టడానికి ప్రతిపక్షాలు సిద్దమవుతున్న నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న అమిత్ షా.. బీజేపీ పనితీరును కాంగ్రెస, సమాజ్‌వాదీ పార్టీల పనితీరుతో పోల్చారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఎలా అధికారంలోకి వచ్చిందో ఆయన వివరించారు. దీనికి భిన్నంగా అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ తమ పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ చివరిసారిగా ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు, ఆ పార్టీ వ్యవస్థాపకుడు, అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ జీవించి ఉన్నారని, మీరు సొంతంగా ఒక్క ఎన్నికలో కూడా గెలవలేదని, రాహుల్ బాబా పరిస్థితి కూడా అంతే అని అమిత్ షా సెటైర్లు వేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+