"మా పొట్ట కొట్టొద్దని రాహుల్ కు చెప్పండి..!"- సోనియాను ఆశ్రయించిన వ్యాపారులు..!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది ఢిల్లీ వ్యాపారుల (Delhi Traders) పరిస్ధితి. ఓవైపు దీపావళి సందర్భంగా వ్యాపారాలు బాగా జరుగుతాయని లెక్కలు వేసుకుని కూర్చొన్న వ్యాపారులకు ఇండియా కూటమి ఢిల్లీలో చేపడుతున్న నిరసనలు సమస్యగా మారాయి. ముఖ్యంగా నవంబర్ 1న ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి భారీ సభ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి ఆంక్షల్ని ఎదుర్కొని అయినా వచ్చి తీరాలంటూ రాహుల్ గాంధీ ఇప్పటికే అందరినీ కోరుతున్నారు. ఈ సభ కోసం వచ్చే వారితో ఢిల్లీ కిక్కిరిసిపోతే తమ వ్యాపారాలు నష్టపోతామని వ్యాపారులు వాపోతున్నారు.
ఇదే విషయాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) చెప్పినా పట్టించుకోకపోవడంతో వారు ఆయన తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీని (Sonia Gandhi) ఆశ్రయించారు. ఢిల్లీలో నవంబర్ 1న నిరసన వాయిదా వేసుకోవాలంటూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ రాహుల్ గాంధీకి ఇప్పటికే మూడు లేఖలు రాశారు. అయినా అనుకూల స్పందన రాకపోవడంతో ఇప్పుడు సోనియా గాంధీని సంప్రదించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ఢిల్లీలోని దాదాపు 20 ప్రధాన మార్కెట్లలో ఆ ఒక్క రోజే 10 నుంచి 12వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని, కాబట్టి రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ర్యాలీని దీపావళి తర్వాత వరకు వాయిదా వేయాలని వారు కోరుతున్నారు.

అయితే రాహుల్ ఎన్నికల కమిషన్ చర్యల వల్ల దేశానికి నష్టం జరుగుతోందని, సీఈసీతో రాజీనామా చేయించమని ప్రధాని మోడీకి చెప్పాలని, ఆయన ఆ నిర్ణయం తీసుకుంటే 30 సెకన్లలోనే సభ రద్దు చేసుకుంటామని రాహుల్ ఇప్పటికే వ్యాపారులకు తెలిపారు. మరోవైపు సాధారణంగా కాంగ్రెస్ రోజువారీ కార్యకలాపాలలో గానీ, రాహుల్ రాజకీయ నిర్ణయాలలో గానీ జోక్యం చేసుకోరని పేరున్న సోనియాగాంధీ.. దానికి బదులుగా ఆమె పార్టీ నాయకులను, ఇతరులను రాహుల్‌ను సంప్రదించమని చురుకుగా ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. కానీ ఇప్పుడు సోనియా గాంధీ ఢిల్లీ వ్యాపారులను కలవాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాంలీలా మైదానంలో సభను కుదించడం, , లేదా నిరసన సమయాన్ని తగ్గించడం లేదా మధ్యాహ్నం లోపు సభ ముగించడం వంటి చర్యల్ని ఆమె రాహుల్ కు సూచించే అవకాశం ఉందని తెలుస్తోంది.














Click it and Unblock the Notifications
