ఢిల్లీకి రండి.. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం: దేశ ప్రజలకు రాహుల్ గాంధీ పిలుపు

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సూత్రాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. 'ఓట్ల చోరీ'కి ముగింపు పలకడమే లక్ష్యంగా నవంబర్ 1న ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదాన్ వేదికగా చేపట్టనున్న 'ఛలో ఢిల్లీ మార్చ్'లో భాగస్వాములు కావాలని దేశప్రజలను కోరారు. ఇది కేవలం ఏదో ఒక రాజకీయ పార్టీ జరిపే కార్యక్రమం కాదని, 'భారతదేశ ఆత్మ'ను రక్షించుకునేందుకు జరుగుతున్న ప్రజా ఉద్యమమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ఇది భారతీయుల మార్చ్.. ఎవరికీ భయపడొద్దు!

కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షా వైఖరితో విసిగిపోయిన వారంతా ఈ ప్రదర్శనలో పాల్గొనాలని రాహుల్ సూచించారు. "పోలీసుల చర్యలకో, లారీచార్జీలకో భయపడాల్సిన అవసరం లేదు. మన రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి మేమంతా మీకు తోడుగా నడుస్తాం. బీజేపీకి ఎలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడే ధైర్యం లేదు. ఇది దేశం కోసం, మీ కోసం జరుగుతున్న మార్చ్. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి" అని ప్రజల్లో భరోసా నింపారు.

Rahul Gandhi Urges Citizens and Students to Join Ramlila Maidan March Against Modi Government Policies
టాప్ లెవెల్ చోరీ- ఇదే నయా హిందూస్థాన్: పబ్లిక్ ఇంపీచ్‌మెంట్
టాప్ లెవెల్ చోరీ- ఇదే నయా హిందూస్థాన్: పబ్లిక్ ఇంపీచ్‌మెంట్

విద్యార్థి లోకానికి ప్రత్యేకాహ్వానం

వివిధ రాజకీయ భావజాలాలతో సంబంధం లేకుండా విద్యార్థి సంఘాలన్నీ ఈ పోరాటంలో కలిసిరావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. "భారతీయతపై, మీ ఆలోచనా స్వేచ్ఛపై, అభివ్యక్తి స్వేచ్ఛపై దాడి జరుగుతోందని మీరు భావిస్తే వెంటనే ఈ యాత్రలో భాగస్వాములుకండి. ఈ ప్రదర్శన దేశ ఆత్మను కాపాడే దిశగా ఒక అద్భుతమైన ఘట్టంగా నిలిచిపోతుంది" అని పేర్కొన్నారు.

అమిత్ షా పరువు నష్టం కేసు- రాహుల్ పై యూపీ కోర్టు కీలక తీర్పు..!
అమిత్ షా పరువు నష్టం కేసు- రాహుల్ పై యూపీ కోర్టు కీలక తీర్పు..!

ఢిల్లీ వేదికగా బిగ్ ఫైట్.. 'ఇండియా' కూటమి సిద్ధం!

నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో జరగబోయే ఈ భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ... 'ఇండియా' కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున శక్తులను సమీకరిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై ప్రతీకాత్మక మహాభియోగం చర్యలు చేపట్టేలా 'మాక్ పార్లమెంట్' నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్షాల బలాన్ని సభా వేదికగా చాటేందుకు నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+