JEE Main 2027 Session 1: జేఈఈ మెయిన్స్ అప్లికేషన్లకు రేపే లాస్ట్ డేట్-ఎన్టీఏ కీలక సూచనలు..!
వచ్చే ఏడాది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ సెషన్ 1 రాసే అభ్యర్ధులకు దరఖాస్తుల ప్రక్రియ (JEE Main 2027 Session 1 Applications) రేపటితో ముగియనుంది. ఇప్పటివరకూ ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఎవరైనా ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఎన్టీఏ కోరుతోంది. అలాగే ఈ అప్లికేషన్లు దాఖలు చేసే అభ్యర్ధులకు ఎన్టీఏ పలు సూచనలు చేస్తోంది. వీటిని తప్పకుండా పాటించడం ద్వారా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ను సాఫీగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈసారి జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షకు ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 13.29 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అలాగే ఇందులో 11.19 లక్షల మంది ఫీజు కూడా చెల్లించి వాటిని సబ్మిట్ కూడా చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇంకా దరఖాస్తు చేసుకోని వారు, అలాగే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి ఇంకా పూర్తి చేయని వారు, అలాగే దరఖాస్తు నింపడం పూర్తయినా ఇంకా ఫీజు చెల్లించని వారికి ఎన్టీఏ పలు సూచనలు చేస్తోంది.

చివరి నిమిషం వరకూ జేఈఈ మెయిన్స్ 2027 సెషన్ 1 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు వేచి ఉండొద్దని ఎన్టీఏ కోరుతోంది. అలాగే ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన వారు ఎలాంటి తప్పులు లేకుండా వాటిని పూర్తి చేయడమే కాకుండా, వెంటనే ఫీజు కూడా చెల్లించి అప్లికేషన్లను సబ్‌మిట్ చేయాలని కోరుతోంది. చివరిగా ఫీజు చెల్లించడం పూర్తయితే కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలని అభ్యర్ధులకు సూచిస్తోంది. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకునే విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సంప్రదించాల్సిన అధికారిక వెబ్ సైట్ అడ్రస్ https://jeemain.nta.nic.in/ ను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే హెల్ప్ లైన్ నంబర్లు 011-40759000 లేదా 1800 180 4747 కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ఈ- మెయిల్ అడ్రస్ [email protected] ద్వారా కూడా ఎన్టీఏను సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు..














Click it and Unblock the Notifications
