గ్లోబల్ టాప్ 200లో చోటు దక్కించుకున్న భారతీయ ఐఐటీ- దేశంలో ఫస్ట్ ప్లేస్..!
మన దేశంలో ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్దలుగా పేరున్న ఐఐటీలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అయితే ఇందులోనూ విద్యాపరంగానే కాకుండా ఇతర అంశాల్లోనూ ఐఐటీలు అంతర్జాతీయంగా భారత కీర్తి పతాకను ఎగురవేస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో తాజాగా అంతర్జాతీయంగా పర్యావరణ సహితంగా నిర్వహిస్తున్న విద్యాసంస్థలకు ఇచ్చే సస్టెయినబిలిటీ ర్యాంకుల్లో భారతీయ ఐఐటీ టాప్ 200లో స్ధానం దక్కించుకుంది. భారత్ లో ఇలాంటి ఐఐటీల్లో ఇదే టాప్ లో నిలిచింది.
ఇవాళ ప్రకటించిన క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2027లో ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) టాప్ 200లో చోటు దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీకి 194వ స్ధానం దక్కింది. గతేడాది ఇదే ర్యాంకింగ్స్ లో 205వ స్ధానంలో ఉన్న ఐఐటీ ఢిల్లీ.. ఈసారి ఏకంగా 11 స్ధానాలు మెరుగుపర్చుకుని 194వ ర్యాంకులో నిలిచింది. అలాగే ఈ కేటగిరీలో భారత్ లో టాప్ ఐఐటీగా నిలిచింది. అలాగే ఆసియా ర్యాంకులో ఐదు స్ధానాలు ఎగబాకి 24వ స్ధానం నుంచి 19వ ర్యాంక్ కు చేరుకుంది. ఐఐటి ఢిల్లీ సస్టైనబిలిటీ స్కోర్ 2026లో 83.1 నుండి 2027లో 86.5కు పెరిగింది. దీనిపై ఐఐటీ ఢిల్లీ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

#QS Sustainability Rankings 2027: #IITDelhi Retains No. 1 Position in India, Features Among Global Top 200IIT Delhi has secured the #1 position in India and entered the global top 200 at #194 in QS World University Rankings: #Sustainability 2027. The Institute has improved its global ranking by 11 places, from #205 last year, and climbed five places in Asia, from #24 to #19. IIT Delhi's overall sustainability score has increased from 83.1 in 2026 to 86.5 in 2027. The achievement reflects the IIT Delhi's continued efforts to integrate sustainability into its campus operations, #research, and institutional practices. The Institute is taking multiple sustainability initiatives for renewable #energy adoption, energy efficiency, water conservation, waste management, and green mobility.Read more at: https://t.co/YL1mCzbBbh
— IIT Delhi (@iitdelhi) November 17, 2026
ఇందులో.. "ఈ విజయం, ఐఐటి ఢిల్లీ తన క్యాంపస్ కార్యకలాపాలు, పరిశోధన, సంస్థాగత పద్ధతులలో సుస్థిరతను ఏకీకృతం చేయడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది." అని తెలిపింది. పునరుత్పాదక ఇంధన వినియోగం, ఇంధన సామర్థ్యం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ మొబిలిటీ కోసం తమ సంస్థ అనేక సుస్థిరత కార్యక్రమాలను చేపడుతోందని ఐఐటి ఢిల్లీ పేర్కొంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, ఇంధన సామర్థ్యం, గ్రీన్ మొబిలిటీ కార్యక్రమాల ద్వారా ఈ సంస్థ తన క్యాంపస్ కార్యకలాపాలలో సుస్థిరతను అనుసంధానించిందని, అంతేకాకుండా, వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, మురుగునీటి పునర్వినియోగం, వ్యర్థాల విభజన, కంపోస్టింగ్, రీసైక్లింగ్ ద్వారా నికర సున్నా నీటి వినియోగం, డంపింగ్ యార్డులకు సున్నా వ్యర్థాలు అనే దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా ఇది సాధిస్తోందని ఐఐటీ తన ప్రకటనలో తెలిపింది.














Click it and Unblock the Notifications
