Operation Sindoor: టార్గెట్ భారత్- పాక్ కు సాయం ముసుగులో చైనా చేసిన కుట్ర..!

పహల్గాం ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఆపరేషన్ లో భాగంగా భారత్.. తొలుత పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ గా చేసుకుంది. అనంతరం పాకిస్తాన్ క్షిపణి రక్షణ వ్యవస్థలను, ఎయిర్ బేస్ లపైనా దాడులు చేసింది. దీంతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ కు చైనా, టర్కీ పరోక్ష సాయం అందించాయి. చైనా ఫైటర్ జెట్లను, టర్కీ డ్రోన్లను తీసుకుని పాకిస్తాన్ ఎదురుదాడులకు దిగింది. ఈ సమయంలో అమెరికా జోక్యంతో ఆపరేషన్ సింధూర్ కాస్తా కాల్పుల విరమణకు దారి తీసింది. అయితే దీని వెనుక ఏం జరిగిందో అమెరికా బయటపెట్టింది.

గతేడాది ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో పాకిస్తాన్ కు చైనా అందించిన సాయం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకూ అర్దమైంది. ఇదే క్రమంలో అమెరికా కాంగ్రెస్ కు చెందిన కమిటీ తన తాజా నివేదికలో చైనా చర్య వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టింది. భారత్ ఎదుగుదలను అణచివేసే వ్యూహంలో భాగంగానే చైనా పాకిస్తాన్ కు ఈ సాయం చేసిందని వెల్లడించింది. భారత్ ను అదుపులో ఉంచడానికి చైనా సరిహద్దుల వెంట సైనిక ఒత్తిడిని, పారిశ్రామిక సరఫరాలపై ఆంక్షల్ని ఉపయోగిస్తోందని కూడా యూఎస్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ తన నివేదికలో వెల్లడించింది.

Operation Sindoor US Panel Links China s Support for Pakistan to Efforts to Counter India s Rise

చైనా ప్రత్యక్షంగా యుద్దంలోకి దిగకుండానే, సంక్షోభ సమయంలో తన మిత్రదేశమైన పాకిస్తాన్ ను ఎలా బలోపేతం చేయగలదో ఆపరేషన్ సింధూర్ చూపించిందని తెలిపింది. ఇలాంటి చైనా ఎత్తుగడల్ని అడ్డుకోవాలంటే భారత్-అమెరికా మధ్య లోతైన నిఘా, సముద్ర యాన, తయారీ రంగ సహకారం అవసరమని ఈ నివేదిక సూచించింది. ఆసియాలో చైనాను ఎదుర్కునే విషయంలో భారత్ కు ఉన్న ప్రాధాన్యతను ఈ నివేదిక మరోసారి గుర్తుచేసింది. అలాగే అమెరికా కూటమి వ్యవస్థకు బయట, ఆసియా ఖండంలో అనుకూల శక్తి సమతౌల్యతను సృష్టించగల కొన్ని శక్తుల్లో భారత్ కూడా ఒకటని ఈ నివేదిక తెలిపింది. చైనా ఉత్పాదక, సరఫరా గొలుసులకు భారత్ ఓ కీలక ప్రత్యామ్నాయంగా కూడా ఇది గుర్తించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+