నందమూరి అలేఖ్యకు పీఆర్పీలో కీలక పదవి..! సాయిరెడ్డి వెల్లడి..!

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్తగా పరివర్తన్ రాజనీతి పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే పార్టీ ప్రారంభమైన తర్వాత కొత్తగా చేరికలు లేకపోవడం, ఇదే పేరుతో మరో పార్టీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన పార్టీ పీఆర్పీ రద్దయినట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో విజయసాయిరెడ్డి ఇవాళ నేరుగా తానే క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో తనకు బంధువైన నందమూరి తారకరత్న సతీమణి నందమూరి అలేఖ్య (Nandamuri Alekhya)కు పార్టీలో కీలక పదవి ఇస్తూ సాయిరెడ్డి ప్రకటన చేశారు.

యలహంక ఇంటిపై కోర్టుకు జగన్ ?- షర్మిలను అడ్డుకోవాలంటూ..!
యలహంక ఇంటిపై కోర్టుకు జగన్ ?- షర్మిలను అడ్డుకోవాలంటూ..!

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పరివర్తన్ రాజనీతి పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిందని టీడీపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. ఈ వాదన ప్రజలను తప్పుదోవ పట్టించి, మా పార్టీలో చేరబోతున్న లేదా చేరాలని ఆలోచిస్తున్న వారిని నిరుత్సాహపరిచే ఉద్దేశ్యంతో కూడుకున్నదని అని ఆయన ఆరోపించారు.
పరివర్తన్ రాజనీతి పార్టీ సక్రమంగా రిజిస్టర్ చేశామని ఆయన తెలిపారు. రాజ్యాంగం, చట్టం, వర్తించే అన్ని నిబంధనలకు అనుగుణంగా పనిచేయడానికి పార్టీ కట్టుబడి ఉందన్నారు.

Vijayasai Reddy Appoints Nandamuri Alekhya as PRP General Secretary Dismisses Deregistration Rumours
మారుతున్న జగన్ వైఖరి? మాజీ బాస్ కు గతాన్ని గుర్తుచేసిన సాయిరెడ్డి ..!
మారుతున్న జగన్ వైఖరి? మాజీ బాస్ కు గతాన్ని గుర్తుచేసిన సాయిరెడ్డి ..!

ఈసీఐ రికార్డుల ప్రకారం తాను వేణుంబాక విజయసాయి రెడ్డి, పార్టీ అధ్యక్షుడిగా, నందమూరి అలేఖ్య ప్రధాన కార్యదర్శిగా, దక్షిణామూర్తి కోశాధికారిగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఏ తప్పుడు ప్రచారం కూడా తన నాయకులు, సభ్యులు, మద్దతుదారుల సంకల్పాన్ని బలహీనపరచలేదన్నారు. పీఆర్‌పీ ఎదుగుతూ, ప్రజలలో తన ఉనికిని బలోపేతం చేసుకుంటూ టీడీపీ, వైఎస్సార్సీపీలకు స్పష్టమైన ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పరివర్తన రాజనీతి పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా నందమూరి అలేఖ్య కనిపించినా, హడావిడి మాత్రం లేదు. దీంతో అందరి దృష్టీ ఆమెపై పడలేదు. కేక్ కటింగ్ తో పాటు కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగినప్పుడు కూడా అలేఖ్య లో ప్రొఫైల్ లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు సాయిరెడ్డి ప్రకటన నేపథ్యంలో ఆమెపై ఒక్కసారిగా ఫోకస్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+