మారుతున్న జగన్ వైఖరి? మాజీ బాస్ కు గతాన్ని గుర్తుచేసిన సాయిరెడ్డి ..!
ఏపీలో ఒకప్పుడు వైఎస్సార్సీపీలో ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నేతగా కీలక పదవులు అనుభవించిన విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) .. ఆ తర్వాత ఆ పార్టీని వీడి.. తాజాగా పరివర్తన రాజనీతి పార్టీ (PRP)ని స్థాపించారు. అయితే గతంలో వైసీపీ అధినేత, తన మాజీ బాస్ వైఎస్ జగన్ కంటే ఆయన కోటరీనే ఎక్కువగా టార్గెట్ చేసిన సాయిరెడ్డి.. తాజాగా రూటు మార్చారు. కొత్త పార్టీ పెట్టాక జగన్, చంద్రబాబుల్ని వరుస పెట్టి ఏకేస్తున్నారు. ఇదే క్రమంలో వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ ఇవాళ సాయిరెడ్డి మరో ట్వీట్ పెట్టారు.
ఇందులో విజయసాయిరెడ్డి.. జగన్ వైఖరిలో వస్తున్న మార్పును ప్రస్తావించారు. వైకాపా చీఫ్ జగన్ మోహన్ గారు క్రమేపీ లెఫ్టిస్టు అవతారం ఎత్తుతున్నట్టు ఉన్నారంటూ సాయిరెడ్డి ఇవాళ తన పీఆర్పీ పార్టీ హ్యాండిల్ ద్వారా ఓ ట్వీట్ చేశారు. అందుకేనేమో,ఇటీవల తరచుగా ఆయన నోటి వెంట నక్సలైట్లు, కాక్రోచ్ లు వంటి పదాలు వస్తున్నాయన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చదువుకున్న యువతకు, నిరుద్యోగులకు ఏం చేశారని సాయిరెడ్డి ప్రశ్నించారు. మరి, అప్పుడు నక్సలైట్లు, కాక్రోచ్ లు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. తద్వారా అధికారం కోల్పోయాకే వారు గుర్తుకొస్తున్నారా అని జగన్ ను ప్రశ్నించారు.

నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ జోరుగా ఉద్యమం సాగిస్తున్న రోజుల్లో జగన్ తాము కూడా ప్రశ్నించే కాక్రోచ్ లమని చెప్పుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తావన తెచ్చారు. దీనిపై ఇతర పార్టీలు పెద్దగా స్పందించలేదు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఇప్పుడు ఆ విషయాన్ని తెరపైకి తెచ్చి జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా యువతకు ప్రతినిధులుగా చెప్పుకునే వైసీపీ అధినేత వైఎస్ జగన్.. వారికి తాను అధికారంలో ఉండగా ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాల కల్పన విషయంలో వైసీపీ, టీడీపీ ఇద్దరూ ఒక్కటేనని పేర్కొంటున్నసాయిరెడ్డి.. ఇప్పుడు గతాన్ని గుర్తుచేస్తూ తన మాజీ బాస్ జగన్ ను ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.














Click it and Unblock the Notifications
