విమానాల్లో మళ్లీ ‘ఇరుముడి’కి అనుమతి- అయ్యప్ప భక్తులకు 'శరణ్' యాప్, పూర్తి సమాచారం..!!

శబరిమల అయ్యప్ప భక్తుల కోసం కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన వెసులుబాటు ఈ ఏడాది కొనసాగిస్తూ ప్రకటన జారీ చేసింది. అయ్యప్ప భక్తులు ఇరుముడిని విమానాల్లో క్యాబిన్‌ బ్యాగేజీగా తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. కాగా, శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం తెలుగు సహా ఆరు భాషల్లో శరణ్ పేరిట కొత్త డిజిటల్ నెట్ వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చింది. శబరిమల యాత్రికులకు పూర్తి సమాచారం ఒక చోట ఉండేలా డిజైన్ చేసింది.

అయ్యప్ప భక్తులు కేంద్ర విమానయాన శాఖ బిగ్ అప్డేట్. శబరిమల అయ్యప్ప భక్తులు ఇరుముడి ని విమానాల్లో క్యాబిన్‌ బ్యాగేజీగా తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ అనుమతి ఇస్తూ నిర్ణయం వెల్లడించింది. ఈ నెల 12 నుంచే ఈ వెసులుబాటు అమల్లోకి వచ్చింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పౌర విమానయాన భద్రతా సంస్థ (బీసీఏఎస్‌) అన్ని ప్రాంతీయ కార్యాలయాలు, విమానాశ్రయాల నిర్వాహకులు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్‌) అధికారులకు మార్గదర్శకాలు జారీచేసింది. అయ్యప్ప భక్తుల ఆచారాలు, విశ్వాసాలను గౌరవిస్తూ గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా అనుమతులు కొనసాగిస్తున్నామని మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.

శ్రీవారికి భక్తుడి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక, టీటీడీ చరిత్రలో తొలిసారి..!!
శ్రీవారికి భక్తుడి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక, టీటీడీ చరిత్రలో తొలిసారి..!!
ayyappa-devotees-get-centres-nod-to-carry-irumudi-as-cabin-baggage-on-flights-details-here

అయ్యప్ప భక్తుల కోసం కొత్త యాప్

కాగా, శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల ప్రయాణం సులభతరం చేయటంతో పాటుగా వారికి కావాల్సిన పూర్తి సమాచారం ఒకే చోట అందించేందుకు కేరళ ప్రభుత్వం కొత్తగా శరణ్ డిజిటల్ వేదిక అందుబాటులోకి తెచ్చింది. తెలుగు సహా ఆరు భాషల్లో ఇందులో పూర్తి సమాచారం అందు బాటులో ఉంటుంది. ప్రయాణ మార్గాలు, విశ్రాంతి కేంద్రాలు, వైద్య సేవలు, రవాణా సదుపాయం సహా పూర్తి సమాచారం ఇందులో నిక్షిప్తం చేసారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు భాష పరంగా సమస్యలు రాకుండా తెలుగు, మళయాళం, తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో శరణ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిని డౌన్ లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఫోన్ల హోం స్క్రీన్లకు జోడించే అవకాశం కల్పించారు. ఇక.. పంబలో తిరిగి స్పాట్ బుకింగ్ కేంద్రాన్ని ప్రారంభించే అవకాశం లేదని దేవస్థానం స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+