తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు, ఈ సారి మార్కులు సైతం..!!

తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు దాదాపు ఖరారయ్యాయి. మార్చి 17 లేదా మార్చి 18 నుంచి ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు సమర్పించారు. ఇంటర్ పరీక్షలు మార్చి 16తో ముగియనున్న నేపథ్యంలో ఈ షెడ్యూల్‌ను ప్రభుత్వ ఆమోదానికి పంపారు. కాగా, ఏప్రిల్ 10వ తేదీకి పరీక్షలు పూర్తి చేసే విధంగా.. గతంలో అమలు చేసిన విధానాన్ని అమలు చేయనున్నారు. అదే విధంగా మార్కుల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తెలంగాణ విద్యా శాఖ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ సిద్దం చేసింది. మార్చి 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభించేందుకు రూపకల్పన చేసిన టైం టేబుల్ ను ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించింది. మార్చి 16తో ఇంటర్ పరీక్షలు పూర్తి కానున్నాయి. దీంతో.. 18వ తేదీ నుంచి పది పరీక్షల నిర్వహణ పైన ఈ ప్రతిపాదన చేసింది. పరీక్షలు మొత్తం 24 రోజులు నిర్వహించి.. ఏప్రిల్ 10వ తేదీ ముగించేలా షెడ్యూల్ ప్రతిపాదించారు. పదో తరగతిలో ఆరు సబ్జెక్టులకు ఏడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. సైన్స్ లో జీవశాస్త్రం, భౌతిక శాస్త్రానికి వేర్వేరు పేపర్లు ఉంటాయి. విద్యార్ధుల పై ఒత్తిడి తగ్గించటానికి సీబీఎస్ఈ తరహాలో పరీక్షల వ్యవధిని పెంచారు. గత ఏడాది అమలు చేసిన విధానమే ఇప్పుడు అమలు చేస్తున్నారు.

శ్రీవారికి భక్తుడి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక, టీటీడీ చరిత్రలో తొలిసారి..!!
శ్రీవారికి భక్తుడి 121 కిలోల బంగారు ఆభరణాల కానుక, టీటీడీ చరిత్రలో తొలిసారి..!!
telangana-ssc-exams-2027-likely-to-begin-on-march-17-or-18-as-proposals-submitted-to-the-govt

కీలక నిర్ణయాలు

కాగా, పరీక్ష ఫీజుల చెల్లింపుకు ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.25 లక్షల మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. అదే విధంగా మార్కుల మెమోలో తప్పుల సవరణకు ఆన్ లైన్ విధానం అందుబాటులోకి తెచ్చారు. పదో తరగతి ఒరిజనల్ మార్కు లిస్టులో విద్యార్ధికి సంబంధించి ఏదైనా పొరపాటు ఉంటే సరి చేయటానికి మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలని పాఠశాల విద్యా శాఖ సూచించింది. ఇక నుంచి ఆఫ్ లైన్ ద్వారా మాన్యువల్ గా దరఖాస్తులు స్వీకరించవద్దని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు సూచించారు. ఈ కొత్త విధానం ద్వారా మీ సేవలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఈ విధానం ద్వారా ప్రక్రియ ఆలస్యం అవుతుందనే అభిప్రాయం ఉంది. ఇక.. పదో తరగతి షెడ్యూల్ పైన ప్రభుత్వం అధికారికంగా ఆమోద ముద్ర వేసిన తరువాత రేపు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+