అంతర్జాతీయ హంగులతో ఓయూకు మహర్దశ.. రూ.480 కోట్ల పనులకు టెండర్లు,శంకుస్థాపన అప్పుడే!

చారిత్రక నేపథ్యం కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధునిక సౌకర్యాలతో కొత్త కళ సంతరించుకుంటోంది. విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆక్స్‌ఫర్డ్ తరహాలో తీర్చిదిద్దుతామన్న హామీకి అనుగుణంగా తొలి దశ భారీ మౌలిక సదుపాయాల పనులకు టెండర్ల ప్రక్రియ మొదలైంది. టీజీఈడబ్ల్యూఐడీసీ పర్యవేక్షణలో రూ.480 కోట్ల విలువైన నిర్మాణ పనులకు అధికారులు ఆహ్వానం పలికారు.

ఈ తొలి విడతలో విద్యార్థుల వసతి, బోధన, పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ నాలుగు ప్రధాన నిర్మాణాలను చేపట్టనున్నారు. అమ్మాయిలు, అబ్బాయిల కోసం వేర్వేరుగా భారీ హాస్టల్ భవనాలను రూ.270 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఒక్కో హాస్టల్‌లో 1,500 మంది చొప్పున మొత్తం 3,000 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా ఈ భవనాలను తీర్చిదిద్దనున్నారు. దీనివల్ల ఏళ్ల తరబడి హాస్టల్ సీట్ల కోసం ఎదురుచూసే ఎంతో మంది విద్యార్థుల వసతి సమస్యకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంది.

Osmania University Tenders Floated for Rs 480 Crore Works Osmania University Set for Global-Standard Overhaul

దీనికి తోడు రూ.210 కోట్ల వ్యయంతో కొత్త అకడమిక్ బ్లాక్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్‌అండ్‌డీ) బ్లాకుల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన కేంద్రాలు, సమగ్ర బోధనా వసతులతో ఈ భవనాలు రూపొందనున్నాయి. విశ్వవిద్యాలయంలో అకడమిక్ వాతావరణాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆవిష్కరణలు, పరిశోధనలకు కొత్త ఊపునివ్వడమే దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

టెండర్ల ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి డిసెంబరులోనే పనులకు శంకుస్థాపన చేయాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబరు 11 వరకు ఆసక్తి గల సంస్థల నుంచి టెండర్లు స్వీకరించి, అదే రోజు సాంకేతిక బిడ్లను తెరుస్తారు. అనంతరం డిసెంబరు 16న ధరల బిడ్లను పరిశీలించి అర్హత కలిగిన నిర్మాణ సంస్థలను ఖరారు చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు వెనుక ఏడాది కాలంగా విస్తృత కసరత్తు జరిగింది.

గత ఏడాది ఆగస్టు 25న రూ.90 కోట్లతో పూర్తయిన భవనాలను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సిటీ సమగ్ర అభివృద్ధికి రూ.1,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత డిసెంబరు 9న పరిపాలనాపరమైన ఆమోదం తెలుపుతూ జీఓ 189 జారీ చేశారు. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిధులు విడుదల కాకపోవడంతో పనుల వేగంపై కొంత జాప్యం ఏర్పడినా, 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించడంతో ఇప్పుడు పనులకు స్పష్టమైన మార్గం సుగమమైంది.

భవనాల రూపకల్పన విషయంలోనూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులు గత ఆరు నెలలుగా అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌లతో చర్చలు జరిపి ఆధునిక, క్రియాత్మక నమూనాలపై దృష్టి సారించారు. మిగిలిన నిధులతో రాబోయే దశల్లో గ్రంథాలయం, ఆడిటోరియం, క్రీడా కేంద్రం, అంతర్గత రహదారులు వంటి ఇతర కీలక మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయనున్నారు.

తెలంగాణ ఉద్యమకారులకు తీపికబురు.. గుర్తింపు కోసం త్వరలోనే ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం!
తెలంగాణ ఉద్యమకారులకు తీపికబురు.. గుర్తింపు కోసం త్వరలోనే ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం!

దేశవ్యాప్తంగా ఎందరో మేధావులను, పాలకులను, పరిశోధకులను తీర్చిదిద్దిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఈ మౌలిక వసతుల కల్పన కీలక మలుపుగా నిలువనుంది. హాస్టళ్లలో వసతి విస్తరణతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు భరోసా కలగనుండగా, కొత్త ఆర్‌అండ్‌డీ, అకడమిక్ భవనాలతో ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో వర్సిటీ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+