నేరుగా శ్రీశైలానికి రైలు మార్గం - ఏపీలో మూడు కొత్త రైల్వే లైన్లు..!!

ఏపీలో రైల్వే శాఖ కీలక నిర్ణయాలకు సిద్దమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ పెంచేలా కొత్త ప్రతిపాదనలు ఆమోదం దశకు చేరాయి. మూడు కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు రైల్వేబోర్డుకు చేరాయి. మార్కాపురం-శ్రీశైలం-సికింద్రాబాద్, రాజంపేట-నెల్లూరు, సామర్లకోట-చింతూరు లైన్ల ఆవశ్యకత, వాటివల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ దక్షిణ కోస్తా రైల్వేజోన్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటికి ఆమోదం లభిస్తే నేరుగా శ్రీశైలానికి రైలు మార్గం ఇక అందుబాటులోకి రానుంది.

ఏపీలో మూడు కీలక రైల్వే లైన్ల ఆమోదం కోసం దక్షిణ కోస్తా రైల్వే ప్రతిపాదనలు చేసింది. రైల్వే బోర్డు వద్ద పరిశీలన దశలో ఉన్న వీటికి త్వరలో ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తోంది. వీటి నిర్మాణం కోసం సర్వే చేపట్టి, డీపీఆర్‌ తయారీకి అనుమతి ఇవ్వాలంటూ రైల్వే బోర్డును కోరారు. ఈ రైల్వేలైన్ల అవసరంతో పాటుగా కలిగే ప్రయోజనాలను పూర్తి స్థాయిలే నివేదికలో వివరించారు. మార్కాపురం నుంచి శ్రీశైలం మీదుగా సికింద్రాబాద్‌ వరకు 290 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మించాలన్నది దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం శ్రీశైలం మల్లన్న ఆలయానికి వెళ్లేందుకు రైలు మార్గం లేదు. కొత్త రైలుమార్గం ఏర్పాటు ద్వారా అన్ని ప్రాంతాల వారికి శ్రీశైలం వెళ్లేందుకు వెసులుబాటు కలుగుతుందని వివరించారు. అదే విధంగా దొనకొండ-ఒంగోలు మధ్య కొత్త రైల్వే లైన్‌ కోసం సర్వే, డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నారు.

పొంచి ఉన్న మరో రెండు తుఫాన్ల ముప్పు, సమృద్ధిగా వర్షాలు ఇక అప్పుడే..!!
పొంచి ఉన్న మరో రెండు తుఫాన్ల ముప్పు, సమృద్ధిగా వర్షాలు ఇక అప్పుడే..!!
south-coast-railway-zone-have-submitted-proposals-to-the-railway-board-for-the-construction-of-three

రైల్వే బోర్డు కు సమగ్ర నివేదిక

సామర్లకోట నుంచి జగ్గంపేట, రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా పోలవరం జిల్లా చింతూరు సమీపం వరకు ఏజెన్సీ ప్రాంతంలో 150 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్ నిర్మించాలని ప్రతిపాదన చేసారు. ఇప్పటికే ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి ఏపీలోని చింతూరు, కూనవరం, వరరామచంద్ర పురం మండలాల మీదుగా తెలంగాణలోని భద్రాచలం, పాండురంగాపురం వరకు 173 కి.మీ. రైల్వే లైన్ మంజూరైంది. అదే విధంగా రాజంపేట-నెల్లూరు మధ్య 120 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్ ప్రతిపాదించారు. ప్రస్తుతం నేరుగా నెల్లూరుకు వెళ్లే మార్గం లేక రేణిగుంట వరకు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. కాగా, మార్కాపురం కొత్త లైన్ అమలైతే హైదరాబాద్ నుంచి నేరుగా శ్రీశైలానికి రైలు సౌకర్యం లభిస్తుంది. కోస్తాంధ్ర జిల్లాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అమలు అయితే పర్యాటక, ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+