శబరిమలకు 204 ప్రత్యేక రైళ్లు, రూట్లు- ఈ స్టేషన్లలో అదనపు వసతులు..!!

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీకి తగినట్లుగా ప్రత్యేక రైళ్లతో పాటుగా ఈ సారి సదుపాయాలను కల్పిస్తోంది. ఈ మేరకు ప్రధాన స్టేషన్లలో రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కావటం తో భక్తులు నిత్యం పలు ప్రాంతాల నుంచి శబరిమలకు వెళ్తూ ఉంటారు. వీరి కోసం రైల్వే శాఖ 204 ప్రత్యేక రైళ్లను ప్రధాన మార్గాల్లో ప్రకటించింది.

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయాలను వెల్లడించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చెన్నై-కొల్లం, తిరువనంతపురం-మంగళూరు, పన్వెల్-కొట్టాయం, విశాఖపట్నం-కొల్లం, హైదరాబాద్-కొల్లం, విజయవాడ-కొట్టాయం మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుత యాత్రా సీజన్ కోసం మొత్తం 204 ప్రత్యేక రైలు ట్రిప్పుల ను ప్రకటించింది. ఇదే సమయంలో భక్తుల నుంచి వచ్చే స్పందన.. డిమాండ్ కు అనుగుణంగా అవసరమైన రూట్ లో మరిన్ని ట్రిప్పులు పెంచుతామని అధికారులు వెల్లడించారు. అదే విధంగా భక్తుల కోసం రైల్వే శాఖ ఈ సారి ముఖ్యమైన రైల్వే స్టేషన్లతో ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వసతి కల్పనతో పాటుగా భోజన సదుపాయాలు, లగేజీ కోసం అదనపు లాకర్లు సిద్దం చేస్తున్నారు.

TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు రిజిస్ట్రేషన్ ఇలా, ఈ తేదీల్లో టోకెన్లు- వీరికి నేరుగా అనుమతి..!!
TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు రిజిస్ట్రేషన్ ఇలా, ఈ తేదీల్లో టోకెన్లు- వీరికి నేరుగా అనుమతి..!!
railways-announces-special-trains-for-sabarimala-pilgrims-amid-heavy-rush-details-here

అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం

అయ్యప్ప భక్తుల కోసం కొట్టాయం, చెంగన్నూర్, ఎర్నాకులం జంక్షన్, ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆహారం, వైద్య సహాయం, రవాణా సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. కొట్టాయంలో రైల్వే స్టేషన్ వద్ద మూడు అంతస్తు ల ప్రయాణికుల సౌకర్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఒకేసారి 900 మంది ప్రయాణికు లు ఉండేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. అదే విధంగా చెంగన్నూరులో 600 మంది ప్రయాణికులకు వసతి కల్పించేలా మూడు షెల్టర్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఒక ఏసీ వెయిటింగ్ హాల్, రెండు నాన్‌-ఏసీ పడక గదులు అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా, ఇక ఎర్నా కులం జంక్షన్‌లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏసీ వెయిటింగ్ హాళ్లు, విశ్రాంతి గదులు, భోజన సదుపాయాలు, లగేజీ లాకర్లను ఏర్పాటు చేసారు. నాన్‌-రిజర్వేషన్ టికెట్ కౌంటర్లు, బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్ నుంచి కేరళ బస్సులను సైతం సిద్దం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+