పెళ్లిళ్ల సీజన్ వేళ.. మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి కుప్పకూలాయి. సోమ, మంగళవారాల్లో ఫర్వాలేదనిపించే స్థాయిలో పెరిగిన ధరలు.. నేడు మూడింతల స్థాయిలో నేలకూలాయి. పెళ్లిళ్ల సీజన్ ఊపందుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వీటి భారీగా తగ్గడం ఆభరణాల కొనుగోలుదారుల్లో జోష్ నింపుతోంది. పసిడి కొనుగోళ్లు ఊపందుకుంటోన్నాయి.. జోరుగా సాగుతున్నాయి. మార్కెట్ కొనుగోలదారులతో కళకళలాడుతోంది.

మంగళవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 3,220 రూపాయల వరకు తగ్గింది. 22 క్యారెట్లు రూ. 2,950, 18 క్యారెట్లు రూ. 2,410 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1,21,860 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,12,622 వద్ద నిలిచింది. వెండి ధరల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. పారిశ్రామిక రంగానికి అవసరమైన వినియోగంతో పాటు పెళ్లిళ్లు, పండుగల సీజన్ కొనుగోళ్ల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 1,44,870 వద్ద నమోదైంది.

Gold and silver prices remained under pressure gets an another huge crash 24K 22K and 18K at MCX

అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ధర 0.16 శాతం తగ్గి ఔన్సుకు 3,551 డాలర్లు పలికింది. స్పాట్ సిల్వర్ ధర 0.25 శాతం క్షీణించి ఔన్సుకు 40.79 డాలర్లకు పడిపోయింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లోనూ ప్రతికూల పరిస్థితులు కనిపించాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 0.30 శాతం క్షీణించి రూ. 1,21,961, వెండి ఫ్యూచర్స్ 0.44 శాతం తగ్గి రూ. 1,43,795 వద్ద కొనసాగుతున్నాయి.

ఐపీఎల్ ఆక్షన్ లో ఆర్యవీర్ సెహ్వాగ్: ఎవడు కొంటాడో గానీ.. !!
ఐపీఎల్ ఆక్షన్ లో ఆర్యవీర్ సెహ్వాగ్: ఎవడు కొంటాడో గానీ.. !!

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,460 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,12,255 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,22,270 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,12,081 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,22,560, రూ.1,12,347 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,22,360, 22 క్యారెట్లు రూ. 1,12,163 వద్ద కొనసాగుతున్నాయి.

సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి ఏపీకి 30 సంక్రాంతి ప్రత్యేక రైళ్లు: రూట్స్, హాల్ట్ స్టేషన్లు
సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి ఏపీకి 30 సంక్రాంతి ప్రత్యేక రైళ్లు: రూట్స్, హాల్ట్ స్టేషన్లు

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 12,458, 22 క్యారెట్లు - రూ. 11,420, 18 క్యారెట్లు - రూ. 9,345

ముంబై..

24 క్యారెట్లు- రూ. 12,458, 22 క్యారెట్లు - రూ. 11,420, 18 క్యారెట్లు - రూ. 9,344

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 12,458, 22 క్యారెట్లు - రూ. 11,420, 18 క్యారెట్లు - రూ. 9,344

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 12,458, 22 క్యారెట్లు - రూ. 11,420, 18 క్యారెట్లు - రూ. 9,344

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 12,458, 22 క్యారెట్లు - రూ. 11,420, 18 క్యారెట్లు - రూ. 9,344

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 12,458, 22 క్యారెట్లు - రూ. 11,420, 18 క్యారెట్లు - రూ. 9,344

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+