IITs: ఐఐటీల్లో కొత్తగా 6 వేల సీట్లు..! ఈ బ్రాంచ్ ల్లో - 2027 నుంచే..!

దేశంలో ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థలుగా పేరున్న ఐఐటీల్లో (IITs) ఇవాళ ప్రతీ సీటుకూ భారీ డిమాండ్ ఉంది. ప్రతీ బ్యాచ్ కు భారీగా ఆదరణ లభిస్తోంది. తమ పిల్లలు ఐఐటీలో సీటు కొడితే చాలు అనుకునే తల్లితండ్రుల సంఖ్య కోట్లలో ఉంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్, మారుతున్న ఇండస్ట్రీ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో అన్ని ఐఐటీల్లో కలిపి 6 వేల కొత్త సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్దమవుతోంది. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది నుంచే మొదలు కానుంది.

OBC కోటా ఉద్యోగాల క్రీమిలేయర్ పై సుప్రీంకోర్టు స్పష్టత..! కేంద్రం అభ్యర్ధనకు నో..!
OBC కోటా ఉద్యోగాల క్రీమిలేయర్ పై సుప్రీంకోర్టు స్పష్టత..! కేంద్రం అభ్యర్ధనకు నో..!

వచ్చే పదేళ్లలో అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో తమ విద్యావకాశాల్ని విస్తరించేందుకు ఐఐటీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ, స్పేస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వంటి ప్రత్యేక కోర్సుల్లో దాదాపు 6 వేల కొత్త సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐటీలు కసరత్తు చేస్తున్నాయి. ఆయా బ్రాంచ్ ల్లో కొత్త సీట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి. అంటే మొదటి బ్యాచ్ లు 2027 నుంచే ప్రారంభమవుతాయి. పలు ఐఐటీలతో కలిసి భూపత్-జ్యోతి మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది.

IITs To Add 6 000 Seats In Robotics Physical AI And Space Technology New Courses From 2027
IIT: విద్యార్థి ఆత్మహత్య- ఫ్యాన్ రాడ్లు మార్చేస్తున్న ఐఐటీ..!
IIT: విద్యార్థి ఆత్మహత్య- ఫ్యాన్ రాడ్లు మార్చేస్తున్న ఐఐటీ..!

ఐఐటీల్లో అందుబాటులోకి వచ్చే కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్థాయి కోర్సులు ఉన్నాయి. వీటిలో విద్యార్ధులకు ఎక్కువ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ సీట్లను పెంచుతున్నారు. ఆయా ప్రోగ్రామ్ లకు 120 మందికి పైగా ప్రొఫెషనల్ అధ్యాపకుల్ని అందుబాటులో ఉంచనున్నారు. ఐఐటీల్లో కొత్తగా పెరిగే సీట్లలో రోబోటిక్స్, ఫిజికల్ ఏఐలో దాదాపు 5 వేల సీట్లు, స్పేస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మరో వెయ్యి సీట్లు లభిస్తాయని అంచనా. యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్ధాయిలో ఈ కోర్సుల్ని నిర్వహిస్తారు. ఈ కోర్సుల్లో మొదటి బ్యాచ్ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తున్నా.. ఈ సీట్లన్నీ పూర్తి స్ధాయిలో అందుబాటులోకి రావడానికి మాత్రం ఎనిమిది నుంచి పదేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆటోమేషన్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, అధునాతన రోబోటిక్స్, అంతరిక్ష పరిశోధనలో నైపుణ్యం ఉన్న నిపుణుల కోసం పరిశ్రమలు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఐఐటీలు ఈ దిశగా అడుగులేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+