"రేవంత్ తమ్ముడిని హైకోర్టు జడ్డిగా నియమించొద్దు"- సీజేఐని కోరిన కేఏ పాల్..!

తెలంగాణలో అదనపు అడ్వకేట్ జనరల్ గా ఉన్న రజనీకాంత్ రెడ్డికి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం సుప్రీంకోర్టు కొలీజియం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని ఆమోదించవద్దంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఇవాళ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ నేతృత్వంలోని కొలీజియానికి అసాధారణ విజ్ఞప్తి చేశారు. ఇందుకు గల కారణాల్ని వివరిస్తూ కేఏ పాల్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆయనకు ఉన్న సంబంధాన్ని ప్రస్తావించారు.

మారుతున్న జగన్ వైఖరి? మాజీ బాస్ కు గతాన్ని గుర్తుచేసిన సాయిరెడ్డి ..!
మారుతున్న జగన్ వైఖరి? మాజీ బాస్ కు గతాన్ని గుర్తుచేసిన సాయిరెడ్డి ..!

తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తేరా రజనీకాంత్ రెడ్డి పేరును హైకోర్టు జడ్జికి రికమెండ్ చేసినట్టు తెలిసిందని కేఏ పాల్ తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో కొలీజియం ఆయన పేరును ఆమోదించకూడదని కోరుతూ ఆయన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్, మరో జడ్జి జస్టిస్ విక్రమ్ నాథ్ కు లేఖ రాసినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి, రజనీకాంత్ రెడ్డికీ మధ్య వందల కోట్ల లావాదేవీలు నడుస్తున్నట్టు ఆరోపణలున్నాయని పాల్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆయన సాయంతో తనపై ఉన్న 89 క్రిమినల్ కేసులను కొట్టేయించుకోవాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

KA Paul Appeals To Supreme Court Collegium Against Revanth Reddy-Linked AAG s Elevation As HC Judge
కాంగ్రెస్ మళ్లీ గెలవదు-నేనూ పోటీ చేయను- మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్..!
కాంగ్రెస్ మళ్లీ గెలవదు-నేనూ పోటీ చేయను- మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్..!

ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని కేఏ పాల్ ఆరోపించారు. ఆయన సీఎం అయ్యాక అనేక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడు రజనీకాంత్ రెడ్డిని న్యాయవ్యవస్థలోకి తీసుకుంటే న్యాయవ్యవస్థ కూడా సర్వనాశనం అవుతుందన్నారు. ముఖ్యంగా గేమింగ్, బెట్టింగ్ యాప్స్ నిషేధించి 400 మిలియన్ల భారతీయ యువతకు మేలు చేసే తీర్పునిచ్చిన సీజేఐ సూర్యకాంత్ ఈ విషయంలో దృష్టి సారించాలని కేఏ పాల్ కోరారు. అంతేకాదు, కొలీజియంలోని మిగతా సభ్యులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ మరో సూచన కూడా చేశారు. ఇంతకీ రజనీకాంత్ రెడ్డికీ, పాల్ కు ఏదైనా వైరం ఉందా లేక రేవంత్ రెడ్డిపై ఉన్న కోపంతో ఆయన ఇలా రజనీకాంత్ రెడ్డికి అడ్డుపడుతున్నారా అన్నది తెలియరాలేదు. అయితే సుప్రీంకోర్టు కొలీజియం కేఏ పాల్ విజ్ఞప్తిని పట్టించుకునే అవకాశాలు మాత్రం దాదాపు లేకపోవచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+