అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఫిక్స్ - కీలక నిర్ణయాలు, బిగ్ టర్న్..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ శీతాకాల అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఫిక్స్ చేసింది. అటు కేంద్రం పార్లమెంట్ సమావేశాలు... ప్రధాన బిల్లుల ఆమోదం కోసం చేస్తున్న ప్రయత్నాల వేళ ఇటు ఏపీ ప్రభుత్వం అసెంబ్లీకి సిద్దమైంది. కీలక బిల్లులను సభలో ప్రవేశ పెట్టే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నారేళ్లు పూర్తవుతున్న వేళ అసెంబ్లీ వేదికగా అనూహ్య నిర్ణయాలకు ప్రభుత్వం సమాయత్తం అయింది.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాలు రాజకీయంగా.. పాలనా పరంగా కీలక నిర్ణయాల కు వేదికగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. తాజాగా విశాఖలో జరిగిన పెట్టుబడి దారుల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. పెట్టుబడుల రక్షణ చట్టం బిల్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా రాజకీయ మార్పులతో పెట్టుబడులకు ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యమని ప్రభుత్వం లోని ముఖ్యులు చెబుతున్నారు. పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపుల విషయంలో చట్టపరమైన భరోసా కల్పించేలా బిల్లును రూపొందించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపైనా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు.

కీలక బిల్లుల ప్రతిపాదన
అదే విధంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, పురోగతి, భవిష్యత్ కార్యా చరణ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక.. అమరావతితో పాటుగా కీలక అంశాల పైన ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు. అభివృద్ధి- సంక్షేమ రంగాలకు రెండున్నరేళ్ల కాలం లో ఇస్తున్న ప్రాధాన్యత.. ప్రభుత్వ లక్ష్యాలను వివరించనున్నారు. ఇక.. స్థానిక ఎన్నికల్లో కూటమి విజయాల తరువాత కేబినెట్ లోనూ కొన్ని మార్పులు అవసరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, అసెంబ్లీ సమావేశాల తరువాత రాష్ట్ర మంత్రివర్గంలోనూ మార్పులు ఉంటాయని కూటమి నేతల సమాచారం. అటు కేంద్రంలో ఇదే సమయంలో పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వే షన్లతో పాటుగా డీలిమిటేషన్ పైనా బిల్లు ప్రతిపాదించి ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. అసెంబ్లీలోని వీటికి మద్దతుగా తీర్మానాలు చేసే ఛాన్స్ ఉందని సమాచారం.













Click it and Unblock the Notifications
