కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ పార్టీ షాక్ - బీజేపీకి కలిసొస్తున్న సమీక'రణం'..!!
జాతీయ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అటు ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక లు.. ఇటు పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు- డీలిమిటేషన్ బిల్లు వేళ రాజకీయంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఇండి కూటమిలో కీలకంగా ఉన్న డీఎంకే ఇప్పటికే కాంగ్రెస్ కు దూరం అయింది. ఇక, ఇప్పుడు సమాజ్ వాదీ ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో, బీజేపీకి రాజకీయంగా ఈ సమీకరణాలు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త లెక్కల వేళ రాజకీయం మరింత ఆసక్తిగా మారుతోంది.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఆ ఎన్నికల్లో కనీసం 120 సీట్లకు తక్కువ కాకుండా ఇవ్వాలని ఎస్పీని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే, తమకు 26 సీట్లు మాత్రమే ఆఫర్ చేయడంతో ఎస్పీపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. సీట్లపై చర్చలు కొనసాగుతుండగానే ఐదుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ఎస్పీ ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ, యూపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'మేం అడగకుండానే 26 సీట్లు ప్రకటించారు. మేం బిచ్చగాళ్లమా?' అని మండిపడ్డారు. పొత్తుపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానమే తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఎవరెన్ని సీట్లలో తొలుత 181 స్థానాలు కోరిన కాంగ్రెస్.. అనంతరం సుమారు 130 నియోకవర్గాలతో కూడిన జాబితాను ఎస్పీకి అందజేసింది.

మారుతున్న సమీకరణాలు
అయితే కాంగ్రెస్‌కు 26 స్థానాలు కేటాయించేందుకు ప్రతిపాదించినట్టు ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 10 వేలకుపైగా ఓట్లు వచ్చిన నియోజక వర్గాలకు ఈ జాబితాలో ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. సహరాన్పూర్ సిటీలో రెండు సీట్లు తమకు ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా.. అప్పటికే ఎస్పీ తన ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. ఓ వైపు సీట్ల పంపకాలపై చర్చలు నడుస్తుండగానే ఎస్పీ తన అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 120 కన్నా తక్కువ సీట్లలో పోటీచేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాయ్ బరేలీ, అమేథీ జిల్లాలతో పాటు తాము కోరిన వివిధ నియోజకవర్గాల సీట్లు తమకు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టబడుతోంది. మరో వైపు సహరాన్‌పూర్‌లోని రెండు సీట్లు, కైరానా, అమ్రోహా, లలిత్పూర్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ను ఎస్పీ ప్రకటించింది. ఆ సీట్లను సిటింగ్ ఎమ్మెల్యేలకే కేటాయించింది. దీంతో, ఈ పరిణామాల ను బీజేపీ తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలతో యూపీ రాజకీయం ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications
