'ఆదర్శ కుటుంబం' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. వెంకీ ఫ్యాన్స్ గెట్ రెడీ..

విక్టరీ వెంకటేశ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఆదర్శ కుటుంబం-ఏకే47' మూవీ గత నెల 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌ గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే నారా రోహిత్​ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ మూవీ థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌ పై తాజా అప్‌ డేట్ వైరల్‌ అవుతోంది. ఈ చిత్రం నవంబర్ 27 నుంచే నెట్‌ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని సమచారం అందుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఆదర్శ కుటుంబం మూవీలో నివేదా పేతురాజ్, యువీనా పార్ధవి, రాజా ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, రఘబాబు, ఉదయ్​బీర్ సంధు, పూజిత పొన్నాడ తదితరులు కీలక నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీంతం అందించారు. రవి కే. చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఎడిటింగ్​ ను నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్​ గా ఏఎస్ ప్రకాశ్ బాధ్యతలను నిర్వర్తించారు. కెవిన్ కుమార్ యాక్షన్​ కొరియోగ్రఫర్​ గా పనిచేశారు. అలాగే ఈ ప్రాజెక్టును హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్​ పై ఎస్. రాధాకృష్ణ నిర్మించారు.

AdarshaKutumbam Here is the OTT release date for the movie OTT release date for the movie news now

ఇక మరోవైపు జనవరి 12 న విడుదల అనే సినిమా కూడా విక్టరీ వెంకటేశ్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో కల్యాణ్ రామ్, కృతి శెట్టి, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+